Ravi Teja: ’క్రాక్’ సినిమాలో ముందుగా అనుకున్న హీరో రవితేజ కాదట.. ఇంతకీ ఎవరంటే.. ‘రాజా ది గ్రేట్’ తర్వాత సరైన విజయాలు లేక ఢీలా పడ్డ రవితేజకు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ మూవీతో మరోసారి హీరోగా సత్తా చూపెట్టారు. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మాస్ మహారాజ్ ఇరగదీసారు. అంతేకాదు.. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత సగం ఆక్యుపెన్షీతో సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. రవితేజకు హీరోగా మళ్లీ బ్రేక్ ఇచ్చిన ఈ సినిమాలో ముందుగా అనుకున్న హీరో రవితేజ కాదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ప్రస్తావించారు.
ఈ సినిమా కథను ముందుగా బాలకృష్ణతో తీయాలనుకున్నట్టు నిర్మాత కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఐతే.. గోపీచంద్ మలినేని కూడా తమిళంలో హిట్టైన ‘సేతుపతి’ సినిమాను కొంచెం మార్పులు చేర్పులు చేసి మాకు వినిపించారు. ఈ కథ విని ఇది మా సినిమా స్టోరీనే కదా అని గోపిచంద్‌తో ప్రస్తావించినట్టు చెప్పారు. ఆ తర్వాత బాలయ్య బిజీగా ఉండటం.. గోపీచంద్ మలినేని ఈ సినిమా కథను రవితేజతో తెరకెక్కించినట్టు చెప్పుకొచ్చారు. ఇక గోపీచంద్ మలినేని ఇపుడు బాలకృష్ణతో ఓ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ రియలిస్టిక్ స్టోరీని తెరకెక్కించబోతున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ ప్రకటన చేసే అవకాశాలున్నట్టు సమాచారం.
క్రాక్:
ఇక రవితేజ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటించారు.
యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అనసూయ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇటలీ కొంత భాగం షూటింగ్ చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ కొంచెం బాలెన్స్ ఉంది. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ సినిమా విడుదలై ఉండేది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.