హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja - Krack: తొలిసారి రవితేజ సినిమాకు ఆ క్రెడిట్‌.. 'క్రాక్‌' డిజిటల్‌ హక్కుల ధరేంతో తెలుసా..!

Ravi Teja - Krack: తొలిసారి రవితేజ సినిమాకు ఆ క్రెడిట్‌.. 'క్రాక్‌' డిజిటల్‌ హక్కుల ధరేంతో తెలుసా..!

రవితేజ Photo : Twitter

రవితేజ Photo : Twitter

Ravi Teja - Krack: డాన్‌శీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ఈ హ్యాట్రిక్‌ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు ధీటుగానే సినిమా భారీ విజయాన్ని సాధించింది. సినిమా థియేట్రికల్‌ రన్‌లోనే కాదు.. డిజిటల్‌, శాటిలైట్‌ హక్కుల విషయంలోనూ నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టిందీ 'క్రాక్‌' సినిమా..

ఇంకా చదవండి ...

  దాదాపు నాలుగు ప్లాపుల తర్వాత మాస్‌ మహారాజ రవితేజకు 'క్రాక్‌' రూపంలో బ్లాక్‌బస్టర్‌ దక్కింది. హిట్‌ అంటే అలాంటి ఇలాంటి హిట్‌ కాదు.. ఏకంగా మరోసారి రవితేజ ఈజ్‌ బ్యాక్‌ అనేంత రేంజ్‌లో కోవిడ్‌ నేపథ్యంలో యాబై శాతం సీటింగ్‌ కెపాసిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వచ్చిన క్రాక్‌ ఇప్పటి వరకు ముప్పై ఐదు కోట్లకు పైగా షేర్‌ వసూళ్లను సాధించింది. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న లేటెస్ట్‌ సమాచారం మేరకు ఇప్పటి వరకు క్రాక్‌ సినిమాకు రూ.18 కోట్లు లాభం వచ్చిందని అంటున్నారు. డాన్‌శీను, బలుపు చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన ఈ హ్యాట్రిక్‌ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు ధీటుగానే సినిమా భారీ విజయాన్ని సాధించింది. సినిమా థియేట్రికల్‌ రన్‌లోనే కాదు.. డిజిటల్‌, శాటిలైట్‌ హక్కుల విషయంలోనూ నిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టిందీ సినిమా.

  ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు తెలుగు ఓటీటీ మాధ్యమం అయిన ఆహా.. క్రాక్‌ సినిమా కోసం ఎనిమిదన్నర కోట్ల రూపాయలను చెల్లించి డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుందట. ఆహా మాధ్యమం భారీగా ఖర్చు పెట్టి హక్కులను దక్కించుకున్న సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. దీంతో వీరు సినిమాను పైరసీ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం ఓ స్పెషల్‌ నెంబర్‌ను, మెయిల్‌ ఐడీని పెట్టి.. వివరాలను అందించమని కోరుతున్నారు. రవితేజ సినిమాకు ఇంత రేంజ్‌లో డిజిటల్‌ హక్కులు రావడం ఇదే ప్రథమమని సినీ వర్గాలు అంటున్నాయి.

  ఈ క్రాక్‌ సక్సెస్‌తో రవితేజ మార్కెట్‌ రేంజ్‌ డబుల్‌ అయ్యింది. అంతే కాదండోయ్‌ రవితేజ కూడా తన రెమ్యునరేషన్‌ను రూ.16కోట్లకు పెంచేశాడని అంటున్నారు. ప్రస్తుతం రమేశ్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఖిలాడి సినిమాలో రవితేజ డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాను మే 28న విడుదల చేయడానికి ప్లాన్‌ చేశారు.

  Published by:Anil
  First published:

  Tags: Krack, Raviteja

  ఉత్తమ కథలు