Krack Movie First Day Collections: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’. ఈ చిత్రంలో రవి తేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇరగదీసాడు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి ప్రవేశించింది.
Krack Movie First Day Collections: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ‘క్రాక్’. ఈ చిత్రంలో రవి తేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇరగదీసాడు. కరోనా తర్వాత ప్రభుత్వం థియేటర్స్ తెరుచుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చిన దాదాపు అందరు హీరోలు వేచి చూద్దామనే ధోరిణిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 9 నెలల తర్వాత ఒక బడా హీరో నటించిన సినిమా డైరెక్ట్‌గా థియేటర్స్‌లో విడుదలైంది. మరోవైపు కొత్త యేడాదిలో సంక్రాంతి బరిలో ప్రేక్షకుల మందుకు వస్తోన్న మొదటి చిత్రం రవితేజ ‘క్రాక్’. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం డూ ఆర్ డై గా మారిపోయింది. అప్పట్లో వరస డిజాస్టర్స్‌తో పూర్తిగా ఇమేజ్ పడిపోతున్న సమయంలో రవితేజతో బలుపు సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. ఐతే.. మొదటి రోజు ఈ సినిమా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్‌తో విడుదల కాలేకపోయింది. ఐతే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా.. చాలా చోట్ల ఫస్ట్ షో నుంచి తెరపై బొమ్మపడింది. ఇక ఆదివారం పూర్తి స్థాయిలో విడుదలైన ఈ చిత్రానికి మంచి వసూళ్లనే రాబట్టింది.
అంతేకాదు సంక్రాంతి టైమ్‌లో సరైన స్టోరీ సినిమా పడితే.. ఎలా ఉంటుందో రవితేజ క్రాక్ మూవీ ప్రూవ్ చేసింది. కరోనా ప్యాండమిక్ కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఓపెన్ అయిన క్రాక్ మూవీ విడుదలైన 5 రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసింది. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ నటనకు తోడు.. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ విలనిజం.. గోపిచంద్ మలినేని టేకింగ్.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. రామ్ లక్షణ్ ఫైట్స్ ఈ సినిమా విజయంలో కీ రోల్ పోషించాయి.
రవితేజ క్రాక్ కలెక్షన్స్ (Ravi Teja Krack)
క్రాక్ తొలి రెండో రోజుల్లేనే 6.25 కోట్ల షేర్.. 10 కోట్లకు పైగా గ్రాస్ (తొలి రోజు నైట్ షోస్ మాత్రమే పడ్డాయి) వసూలు చేసింది. మూడో రోజు కూడా దాదాపు రూ. 4 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చిందని తెలుస్తుంది. మూడో రోజు రూ. 2.86 కోట్లను కొల్లగొట్టిన రవితేజ క్రాక్.. నాల్గో రోజు..దాదాపు 3.50 కోట్లను కొల్లగొట్టింది. ఐదో రోజు 2.17 కోట్లను రాబట్టిన ఈ సినిమా ఆరో రోజు.. దాదాపు రూ. 1.5 కోట్లను రాబట్టింది. మొదటి రోజు నుంచి చూసుకుంటే.. ఈ సినిమా దాదాపు రూ. 20 కోట్ల వరకు వసూళ్లను సాధించి బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంది. దాదాపు రూ. 17 కోట్లకు అమ్ముడు పోయిన ఈ సినిమా ఇపుడు లాభాల్లోకి వచ్చేసంది. మొత్తంగా సంక్రాంతి బరిలో నిలిచిన క్రాక్ మూవీ 2021లో తొలి హిట్‌గా నిలిచింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.