Ravi Teja Krack Censor: సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ ‘క్రాక్’.. టాక్ ఎలా ఉందంటే..

రవితేజ ‘క్రాక్’ సెన్సార్ పూర్తి (Instagram/Photo)

Ravi Teja Krack Movie Censor Completed |మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం క్రాక్‌. డాన్‌ శీను, బ‌లుపు లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హాట్రిక్ సినిమా ఇది. జనవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.

  • Share this:
    Ravi Teja Krack Movie Censor Completed |మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం క్రాక్‌. డాన్‌ శీను, బ‌లుపు లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హాట్రిక్ సినిమా ఇది. దాంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం డూ ఆర్ డై గా మారిపోయింది. అప్పట్లో వరస డిజాస్టర్స్‌తో పూర్తిగా ఇమేజ్ పడిపోతున్న సమయంలో రవితేజతో బలుపు సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. మరోసారి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు రవితేజ. దాంతో ఇప్పుడు కూడా ఇదే చేస్తాడని నమ్ముతున్నారు రవితేజ అభిమానులు. కొత్త యేడాది కానుకగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి పోలీస్ పాత్రలో రవితేజ ఇరగదీసాడు. రవితేజ పోతరాజు వీర శంకర్‌గా అదరగొట్టాడు. ఇక ఇతర పాత్రల్లో సీనియర్ నటులు సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ నటించారు.

    తాజాగా ఆ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. దాదాపు మూడేళ్ల తర్వాత శృతి హాసన్ ఈ సినిమాతో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇస్తోంది.








    View this post on Instagram






    A post shared by RAVI TEJA (@raviteja_2628)





    ఈ సినిమాను తమిళ సినిమా విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘సేతుపతి’ ఆధారంగా తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. టీజర్, ట్రైలర్స్  షాట్స్ చూసిన తర్వాత కూడా ఇదే అనిపిస్తుంది. విజయ్ సేతుపతి హీరోగా మూడేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. తెలుగులో దీన్ని జయంత్ సి పరాన్జీ జయదేవ్ పేరుతో రీమేక్ చేసాడు. మళ్లీ ఇప్పుడు మరోసారి ఇలాంటి కథతోనే రవితేజ క్రాక్ సినిమా చేస్తున్నాడు.

    Ravi Teja Krack Movie Trailer released, Raviteja Khiladi, Venkatesh ,Raviteja films, sharath kumar,Pranitha Subhash pics, pranitha hot yoga,pranitha hot,pranitha fb,pranitha facebook,pranitha insta,pranitha instagram,pranitha twitter,pranitha size,pranitha age, ప్రణీత హాట్ అందాలు, ప్రణీత హాట్,ప్రణీత
    క్రాక్ ట్రైలర్ Photo : Twitter


    క్రాక్ సినిమాలో ఇతర  ముఖ్య పాత్రల్లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంటుందని.. అందులో అందాల తార ప్రణీత చేస్తోంది. దీని తర్వాత ఓ ఎంటర్ టైనర్‌ను నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుందన.. సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ మంచి కామెడీ టైమింగ్ తో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరోసారి రవితేజ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించబోతుందట. ఇప్పటికే క్రాక్ సినిమాలోనూ శ్రుతి హాసనే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు మరో సినిమాలో కూడా శ్రుతి హాసనే అంటున్నారు. ఈ సినిమాతో రవితేజ ఖచ్చితంగా ఓ హిట్ కొడతాడు అంటున్నారు ఆయన ఫ్యాన్స్.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: