రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమా కలెక్షన్స్ విషయంలో కిరాక్ పుట్టిస్తుంది. ఈ చిత్రంతో చాలా ఏళ్ళ తర్వాత బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు మాస్ రాజా. సంక్రాంతి సీజన్లో పర్ఫెక్ట్ మాస్ సినిమా వస్తే కలెక్షన్స్ ఎలా వస్తాయో ఈ సినిమా నిరూపిస్తుంది. క్రాక్ వచ్చిన రోజు నుంచి కలెక్షన్స్ కిరాక్ పుట్టిస్తుంది. ప్యాండమిక్ కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఓపెన్ అయిన క్రాక్ రెండో రోజే 6.25 కోట్ల షేర్.. 10 కోట్లకు పైగా గ్రాస్ (తొలి రోజు నైట్ షోస్ మాత్రమే పడ్డాయి) వసూలు చేసింది. ఇదిలా ఉంటే తొలిరోజు నైట్ షోస్ తర్వాత రెండో రోజు రచ్చ చేసాడు రవితేజ. మూడో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో క్రాక్ హవా కనిపించింది. ఈ సినిమా ఇప్పుడు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ట్రేడ్‌కు కూడా షాక్ ఇస్తూ దూసుకుపోతుంది. జనవరి 11న వసూళ్ళు చూసి ట్రేడ్ కూడా షాక్ అవుతుంది. కరోనా ఉన్నా కూడా థియేటర్స్ దగ్గర ఆడియన్స్ క్యూ కడుతున్నారు. పండగ సీజన్ కావడం.. పాజిటివ్ టాక్ రావడంతో పిచ్చెక్కిస్తున్నాడు రవితేజ. కిరాక్ మాస్ పర్ఫార్మెన్స్తో క్రాక్ రేపుతున్నాడు. వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్ అంటూ పండగ చేసుకుంటున్నారు ఆయన డై హార్డ్ ఫ్యాన్స్.

రవితేజ క్రాక్ కలెక్షన్స్ (Ravi Teja Krack)
డాన్ శీను, బలుపు సినిమాల తర్వాత గోపీచంద్ మలినేని ఈ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే రవితేజతో తన స్టామినా చూపించాడు గోపీచంద్. ఈ సినిమాకు రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన ఫైట్స్ కూడా కారణమే. మూడో రోజు కూడా దాదాపు 4 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చిందని తెలుస్తుంది. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. థియేటర్స్ ఎక్కువ ఉండటంతో కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. అదే కానీ 100 శాతం ఆక్యుపెన్సీ కానీ ఉండుంటే క్రాక్ కలెక్షన్స్‌లో రవితేజ కెరీర్లోనే కిరాక్ పుట్టించేది.
Published by:Praveen Kumar Vadla
First published:January 11, 2021, 22:42 IST