హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja Krack : సూపర్ స్టడీగా క్రాక్.. ఆ సినిమాలను తీసేసి మరి క్రాక్‌ సినిమా ప్రదర్శన..

Ravi Teja Krack : సూపర్ స్టడీగా క్రాక్.. ఆ సినిమాలను తీసేసి మరి క్రాక్‌ సినిమా ప్రదర్శన..

Ravi Teja Krack : టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మసాలా ఎంటర్టైనర్ క్రాక్.

Ravi Teja Krack : టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మసాలా ఎంటర్టైనర్ క్రాక్.

Ravi Teja Krack : టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మసాలా ఎంటర్టైనర్ క్రాక్.

  టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మసాలా ఎంటర్టైనర్ క్రాక్. ఎన్నో అడ్డంకుల నడుమ విడుదలైన ఈ సినిమా సంక్రాంతి వాటిని అన్నింటిని దాటుకుంటూ ఇప్పుడు భారీ హిట్ దిశగా ముందుగు సాగుతోంది. క్రాక్ సినిమా ఇప్పటికీ కూడా స్ట్రాంగ్‌గా కొనసాగుతోంది. అంతేకాదు క్రాక్ కు పలు చోట్ల స్క్రీన్స్, షోలు యాడ్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అయితే ఇతర సినిమాలను తొలగించి క్రాక్‌ను ప్రదర్శిస్తున్నారట. ఇక ఈ సినిమాతో రవితేజ మరోసారి తన పవరేంటో చూపించుకున్నాడు. అంతేకాదు సంక్రాంతి రేసులో వచ్చిన అన్ని సినిమాలను దాటి.. సంక్రాంతి విన్నర్‌గా రవితేజ క్రాక్ నిలిచింది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. శృతి కూడా మంచి సినిమాతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చిందనే అంటున్నారు. క్రాక్ సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా రీమేక్ హక్కులకు గాను భారీ ఆఫర్స్ తో పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ సినిమా ఇటు తమిళ్‌తో పాటు అటు హిందీలోను రీమేక్ కానుందని సమాచారం. రవితేజ మాస్ మసాల యాక్షన్ క్రాక్ మాత్రం కావాల్సినంత ఎంటర్ టైన్‌మెంట్‌ను ఇస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. అది అలా ఉంటే ఈ సినిమా డిజిటల్ హక్కులు ఎవరు దక్కించుకున్నారని మరో టాక్ నడుస్తోంది.

  ఈ విషయంలో లేటెస్ట్ టాక్ ప్రకారం క్రాక్ స్ట్రీమింగ్ హక్కులను అల్లు అరవింద్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ “ఆహా” క్రాక్‌ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

  View this post on Instagram


  A post shared by RAVI TEJA (@raviteja_2628)  View this post on Instagram


  A post shared by RAVI TEJA (@raviteja_2628)  క్రాక్ సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రమేష్ వర్మ విషయానికి వస్తే ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఆ మధ్య రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని పొందాడు. తమిళ రాచసన్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో బెల్లంకొండ చాలా సంవత్సరాల తర్వాత మంచి విజయాన్ని అందుకున్నాడు.

  View this post on Instagram


  A post shared by RAVI TEJA (@raviteja_2628)  ఇక రమేష్ వర్మ ఇదే ఊపులో రవితేజకు మరో మంచి విజయాన్ని అందించనున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ఇక ఇదే కాంబినేషన్’లో 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. అయితే క్రాక్ ఇచ్చిన బూస్ట్‌తో ఖిలాడీని మరింత జాగ్రత్తగా, భారీగా అన్ని హంగులతో రెడీ చేస్తున్నారట దర్శకనిర్మాతలు.

  First published:

  Tags: Raviteja, Tollywood news

  ఉత్తమ కథలు