RAVI TEJA KHILADI WW CLOSING COLLECTIONS AND MASS RAJA GETS ANOTHER FLOP PK
Khiladi WW closing collections: ‘ఖిలాడి’ క్లోజింగ్ కలెక్షన్స్.. రవితేజకు మరో ఫ్లాప్..
Ravi Teja Khiladi on Hotstar Photo : Twitter
Khiladi WW closing collections: మాస్ రాజా రవితేజ (Ravi Teja)కు మరో ఫ్లాప్ తప్పలేదు. ఈయన హీరోగా రమేష్ వర్మ (Ramesh Varma) తెరకెక్కించిన చిత్రం ఖిలాడి (Khiladi). ఈ సినిమాకు యావరేజ్ వసూళ్లు అయితే వచ్చాయి కానీ అవి సరిపోయేవి మాత్రం కాదు. చేసిన బిజినెస్‌కు వచ్చిన కలెక్షన్స్‌కు పోలిక లేకుండా పోయింది.
మాస్ రాజా రవితేజ (Ravi Teja)కు మరో ఫ్లాప్ తప్పలేదు. ఈయన హీరోగా రమేష్ వర్మ (Ramesh Varma) తెరకెక్కించిన చిత్రం ఖిలాడి (Khiladi). ఈ సినిమాకు యావరేజ్ వసూళ్లు అయితే వచ్చాయి కానీ అవి సరిపోయేవి మాత్రం కాదు. చేసిన బిజినెస్‌కు వచ్చిన కలెక్షన్స్‌కు పోలిక లేకుండా పోయింది. దాంతో భారీ నష్టాల దిశగా ఖిలాడి అడుగులు వేసింది. ముఖ్యంగా రవితేజ ఇమేజ్ వాడుకోవడంలో దారుణంగా విఫలం అయ్యాడు దర్శకుడు రమేష్ వర్మ. అందుకే రోజులు మారినా ఈ సినిమా జాతకం మాత్రం మారలేదు. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్ వసూళ్లపై దారుణంగా ప్రభావం చూపిస్తుంది. యావరేజ్ కలెక్షన్లతో అలా వెళ్లిందే కానీ సేఫ్ అయితే కాలేదు. ఇప్పుడు ఓటిటి రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకోవడంతో సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసాయి. తెలుగు రాష్ట్రాల్లో ఖిలాడి కేవలం 11.40 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది ఈ సినిమాకు. ఇప్పటికే చాలా చోట్ల ఖిలాడి వసూళ్లు క్లోజ్ అయిపోయాయి. క్రాక్ (Krack) లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చినా.. ఆ క్రేజ్ క్యాష్ చేసుకోవడంలో ఖిలాడి ఫెయిల్ అయింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే తేడా కొట్టడంతో సినిమా కూడా తేడా కొట్టేసిందంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాతో వరసగా రెండో హిట్ కొట్టాలని కలలు కన్న రవితేజకు అవి కలలుగానే మిగిలిపోయాయి.
డింపుల్ హయాతీ (Dimple Hayathi), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించారు ఈ చిత్రంలో. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఖిలాడి సినిమాలో స్క్రీన్ ప్లే స్లోగా ఉండటంతో సినిమాకు మైనస్ అయిపోయింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఓ సారి చూద్దాం..
ఖిలాడి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.23.50 కోట్ల బిజినెస్ జరిగింది. కానీ ఫుల్ రన్లో ఈ చిత్రం వసూలు చేసింది కేవలం 13.40 కోట్లు మాత్రమే. అంటే మరో 10.20 కోట్ల దూరంలోనే ఉండిపోయింది ఖిలాడి. రవితేజ కెరీర్లో ఈ మధ్య కాలంలో జరిగిన బిగ్గెస్ట్ బిజినెస్ ఇది. క్రాక్ బ్లాక్‌బస్టర్ కావడంతో ఖిలాడి సినిమాకు బిజినెస్ బాగానే జరిగింది. కానీ అంచనాలు అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది ఖిలాడి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.