Home /News /movies /

Ravi Teja : రవితేజ ఖిలాడి విడుదలపై క్లారిటీ.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్రబృందం..

Ravi Teja : రవితేజ ఖిలాడి విడుదలపై క్లారిటీ.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చిత్రబృందం..

Raviteja Khiladi Photo : Twiiter

Raviteja Khiladi Photo : Twiiter

Ravi Teja : రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

    Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ 2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా ఈ యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కొత్త ఊపిరిని ఇచ్చింది. మరోవైపు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు.

    మరోవైపు యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. క్రాక్ తర్వాత ఈ సినిమా రావడంతో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది.ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


    ఈ సినిమాతో పాటు రవితేజ మరో సినిమాను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటించనుందని టాక్.

    ఈ సినిమాతో పాటు రవితేజ వరుసగా పలు సినిమాలను అంగీకరిస్తూ.. షూటింగ్‌లను కంప్లీట్ చేస్తున్నారు. అందులో భాగంగా రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’  (Raviteja Ramarao On Duty) అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శర వేగంగా షూటింగ్‌ను జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ ను ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతాల్లో శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్‌ సీక్వెన్సెస్‌ పూర్తయ్యాక, పాటల చిత్రీకరణ కోసం చిత్రబృందం విదేశాలకు వెళ్లనుందని తెలుస్తోంది.
    Acharya | Ram Charan : సోషల్ మీడియాలో అదరగొడుతోన్న నీలాంబరి.. మణిశర్మ మెలోడీకి సూపర్ రెస్పాన్స్..

    ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చాలా రోజులకు వేణు తొట్టెంపూడి కూడా నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుందట. ఈ సినిమాను ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రామారావు ‘ఆన్ డ్యూటీ’ అంటూ విడుదల చేసిన పోస్టర్స్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇందులో రవితేజ లుక్.. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా సరికొత్త మేకోవర్ తో కనిపించనున్నారు. నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

    ఇక తాజాగా రవితేజ కెరీర్‌లో 70వ సినిమాని ప్రకటించారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మతో తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాకు టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రవితేజని “రావణాసుర” గా పరిచయం చేశారు. ఒక భారీ కపాలం పై కూర్చొన్నారు మాస్ మహా రాజ్. పోస్టర్‌లో రవితేజకు 9 తలలు ఉన్నాయి. క ఆయన ఇటీవల ఓ ప్యాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావుగా వస్తోన్న సినిమాకు వంశీ దర్శకత్వం వహించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Raviteja, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు