Ravi Teja - Khiladi: రవితేజ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అనసూయ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇటలీ కొంత భాగం షూటింగ్ చేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి భారీ ఆఫర్ దక్కించుకున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మన దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. దీంతో జనాలు కూడా అదే రేంజ్లో కరోనా బారిన పడుతున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ నడుస్తోంది. మరోవైపు ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుంచే కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు.ఈ నేపథ్యంలో ముందుగా విడుదల తేదిలు ఖరారు చేసుకున్న సినిమాలు వాయిదా పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో అన్ని సినిమాల్లో లాగా రవితేజ ‘ఖలాడి’ మూవీ కూడా వాయిదా పడింది.రవితేజ సంక్రాంతికి క్రాక్ సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చిందనే చెప్పొచ్చు.ఈ సినిమా సక్సెస్‌తో రవితేజ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఖిలాడి’ పై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను ఓటీటీ రిలీజ్ కోసం రూ. 45 కోట్ల భారీ ఆఫర్ ప్రకటించినట్టు తెలుస్తోంది. గతంలో రవితేజ నటించిన ‘క్రాక్’ మూవీని ఓటీటీ ఆఫర్ వచ్చినా.. డైరెక్ట్‌గా థియేటర్స్‌లో విడుదల చేసి మంచి ఫలితాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మేకర్స్ .. కరోనా సెకండ్ వేవ్ తగ్గేంత వరకు వేచి చూస్తారా.. అమెజాన్ ఓటీటీ ఆఫర్‌కు ఓకే చెబుతారా అని చూడాలి. మొత్తంగా థియేటర్స్ మూత పడటంతో ఇపుడు పెద్ద హీరోల సినిమాలకు భారీ ఓటీటీ ఆఫర్స్ తలుపు తడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Meenakshi Chaudhary, Ravi Teja, Tollywood