Ravi Teja - Khiladi: మాస్ మహారాజ్ రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’. రమేష్ వర్మ (Ramesh Varma) డైరెక్ట్ చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ పాటికి ఈ సినిమా షూటింగ్ పూర్తై ఉండేది. కానీ కరోనా మహామ్మారి కారణంగా అన్ని షూటింగ్స్ మాదిరే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ గ్యాప్‌లోనే రవితేజ్.. శరత్ మండవ (Sharath Mandava) దర్శకత్వంలో ‘రామారావు’ (Rama Rao) అనే సినిమా స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ (Ravi Teja)ఎమ్మార్వో పాత్రలో నటిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. కరోనా సెకండ్ వేవ్ మూలంగా షూటింగ్ వాయిదా పడ్డ ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ ఈ రోజు తిరిగి ప్రారంభమైంది. ఈ షూటింగ్‌లో రవితేజ కాకుండా మిగతా నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
త్వరలోనే రవితేజ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ‘ఖిలాడి’ విషయానికొస్తే.. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతితో పాటు మీనాక్షి చౌదురి హీరోయిన్స్‌గా నటించారు. అనసూయ మరో కీలక పాత్రలో కనిపించనుంది.ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్‌లో నటించాడా ? ఒకడే ఇద్దరిగా నటిస్తున్నాడా అనేది ఆసక్తికరంగా ఉంది. . రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు
Mass Maharaja @RaviTeja_offl 's #Khiladi Shoot Resumed. #KhiladiShootResumes @DirRameshVarma @DimpleHayathi @_meenakshii1 @ThisIsDSP @sagar_singer@idhavish @PenMovies @KHILADiOffl@UrsVamsiShekar pic.twitter.com/4bryTXORP4
— BARaju's Team (@baraju_SuperHit) July 26, 2021
ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంటుందని.. అందులో అందాల తార ప్రణీత నర్తిస్తుందని సమాచారం. అదే గనుక నిజమైతే.. రవితేజ, ప్రణీత కాంబినేషన్ లో వచ్చే తొలి సినిమా ఇదే అవుతుంది. ప్రణీత ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ యన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది.ఇక రవితేజ సంక్రాంతికి క్రాక్ సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చిందనే చెప్పొచ్చు.
ఈ సినిమాకు ముందు రవితేజ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించింది. ఆమెకు మంచి కమ్ బ్యాక్ సినిమా అయ్యింది. ఇక క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ ఖిలాడి అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్ వర్మ గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇదే కాంబినేషన్’లో రవితేజ హీరోగా 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dimple hayathi, Khiladi Movie, Meenakshi Chaudhary, Pen Movies, Ramesh Varma, Ravi Teja, Sharath Mandava