Home /News /movies /

RAVI TEJA KHILADI MOVIE RELEASED ON FEBRAURY 11TH ON US PREMIERS ON FEB 10 TA

Ravi Teja - Khiladi : అనుకున్న సమయానికే థియేటర్స్‌లో రవితేజ ‘ఖిలాడి’ .. కొత్త పోస్టర్ విడుదల..

రవితేజ ‘ఖిలాడి’ మూవీ విడుదల (Twitter/Photo)

రవితేజ ‘ఖిలాడి’ మూవీ విడుదల (Twitter/Photo)

Ravi Teja Khiladi | మాస్ మహారాజ్ రవితేజ గతేడాది ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీని ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నట్టు మరోసారి అధికారికంగా ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  Ravi Teja - Khiladi |  మాస్ మహారాజ్ రవితేజ గతేడాది  ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కొత్త ఊపిరిని ఇచ్చింది. మరోవైపు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు.

  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రవితేజ బర్త్ డే కానుకగా 4వ పాటను విడుదల చేయనున్నారు. కరోనా నేపథ్యంలో చిరంజీవి ‘ఆచార్య’ సహా పలు సినిమాలు వాయిదా పడ్డాయి. అదే రూట్లో రవితేజ..‘ఖిలాడి’ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయనే టాక్ వినబడ్డాయి. వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ.. ఈ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా.. ఫిబ్రవరి 10 యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నట్టు ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఈ సినిమా విడుదలపై ఉన్న అనుమానాలను పటా పంచలు చేసారు.  ‘ఖిలాడి’ మూవీ విషయానికొస్తే.. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్  ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ’క్రాక్’ తర్వాత ఈ సినిమా రావడంతో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది.ఈ సినిమాను  ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అదే డేట్ విడుదల చేస్తారా లేదా అనేది జనవరి 26న తేలిపోనుంది. ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 11న థియేటర్స్‌లో విడుదల కావడం పక్కా అని చెబుతున్నారు.

  Ravi Teja : హీరో రవితేజ తల్లిపై పోలీసు కేసు నమోదు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

  ‘ఖిలాడి’ సినిమాతో పాటు రవితేజ మూడు నాలుగు చిత్రాలను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటించనుందని టాక్.ఈ సినిమాతో పాటు రవితేజ  తన 68వ సినిమాగా ‘రామారావు’  (Raviteja Ramarao On Duty) అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ మూవీని మార్చి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

  Oscar : మన దేశం తరుపున ఆస్కార్ బరిలో సూర్య ‘జై భీమ్’.. మోహన్‌లాల్ ‘మరక్కార్’..

  ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చాలా రోజులకు వేణు తొట్టెంపూడి కూడా నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుందట. ఈ సినిమాను ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

  Allu Arjun - Ravi Teja : అల్లు అర్జున్ బాటలో రవితేజ, విజయ్ దేవరకొండ, అడివి శేష్.. అక్కడ మాత్రం తగ్గేదేలే అంటున్న హీరోలు..

  దాంతో పాటు  రవితేజ కెరీర్‌లో 70వ సినిమాగా ‘రావణాసుర’ చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.   ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు.  ఇందులో సుశాంత్ రాముడి పాత్రలో నటించబోతున్నట్టు పోస్టర్ కూడా విడుదల చేసారు.


  వీటితో పాటు రవితేజ..  ఇటీవల ఓ ప్యాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావుగా వస్తోన్న సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు రవితేజ.. చిరంజీవి, బాబీ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. దీని కోసం భారీ స్థాయిలో పారితోషకం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Action King Arjun, Dimple hayathi, Meenakshi Chaudhary, Ramesh Varma, Ravi Teja, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు