Ravi Teja Khiladi: రవితేజ ‘ఖిలాడి’ మూవీ విషయంలో అనుకున్నందే జరిగింది. ప్రస్తుతం మన దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. దీంతో జనాలు కూడా అదే రేంజ్లో కరోనా బారిన పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ నడుస్తోంది. మరోవైపు ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుంచే కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ముందుగా విడుదల తేదిలు ఖరారు చేసుకున్న సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’ మూవీ విడుదల తేదిని పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్‌లో అన్ని సినిమాల మాదిరిగానే ఈ మూవీ విడుదలకు అడ్డంకిగా మారింది.
ఖిలాడి విషయానికొస్తే.. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతితో పాటు మీనాక్షి చౌదురి హీరోయిన్స్‌గా నటించారు. అనసూయ మరో కీలక పాత్రలో కనిపించనుంది.ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్లో నటించాడా ? ఒకడే ఇద్దరిగా ప్రవర్తించాడా అనేది ఆసక్తికరంగా ఉంది. . రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పెన్ మూవీస్ నిర్మిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు.
Keeping the current #Covid19 Pandemic in mind,Mass Maharaja @RaviTeja_offl's #Khiladi has been postponed! ?
A New Release Date will be announced soon. @DirRameshVarma @ThisIsDSP @DimpleHayathi @Meenachau6 @sagar_singer @idhavish #AStudiosLLP @PenMovies @KHILADiOffl @adityamusic pic.twitter.com/TINxBuwGMU
— BARaju (@baraju_SuperHit) May 5, 2021
ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంటుందని.. అందులో అందాల తార ప్రణీత నర్తిస్తుందని సమాచారం. అదే గనుక నిజమైతే.. రవితేజ, ప్రణీత కాంబినేషన్ లో వచ్చే తొలి సినిమా ఇదే అవుతుంది. ప్రణీత ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ యన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది.ఇక రవితేజ సంక్రాంతికి క్రాక్ సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చిందనే చెప్పొచ్చు.
ఈ సినిమాకు ముందు రవితేజ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. ఆమెకు మంచి కమ్ బ్యాక్ సినిమా అయ్యింది. ఇక క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ ఖిలాడి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. రమేష్ వర్మ గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని పొందాడు. ఇక ఇదే కాంబినేషన్’లో రవితేజ హీరోగా 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. ఈ సినిమా తర్వాత రవితేజ నక్కిన త్రినాథ రావు సినిమాతో పాటు ఉగాది శరత్ మండవ అనే కొత్త దర్శకుడి చిత్రంలో నటిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Meenakshi Chaudhary, Ravi Teja, Tollywood