హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja - Khiladi : రవితేజ ‘ఖిలాడి’ మూవీ నుంచి ‘అట్టా సూడకే’ లిరికల్ సాంగ్ విడుదల.. అదిరిన మాస్ మహా రాజా స్టెప్పులు..

Ravi Teja - Khiladi : రవితేజ ‘ఖిలాడి’ మూవీ నుంచి ‘అట్టా సూడకే’ లిరికల్ సాంగ్ విడుదల.. అదిరిన మాస్ మహా రాజా స్టెప్పులు..

రవితేజ ‘ఖిలాడి’ (Twitter/Photo)

రవితేజ ‘ఖిలాడి’ (Twitter/Photo)

Ravi Teja Khiladi | మాస్ మహారాజ్ రవితేజ ఈ యేడాది ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా ఈ యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి థర్ట్ సింగిల్ ‘అట్టా సూడకే’ పాటను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...

Ravi Teja - Khiladi |  మాస్ మహారాజ్ రవితేజ ఈ యేడాది ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా ఈ యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కొత్త ఊపిరిని ఇచ్చింది. మరోవైపు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాట ‘అట్టా సూడకే’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకు సింగర్ సమీరా భరద్వాజ్‌తో కలిసి దేవీశ్రీ పాడి అదరగొట్టాడు.  శ్రీ మణి సాహిత్యం అందించారు. శేఖర్ మాస్టర్ ఈ పాటను కంపోజ్ చేశారు. ఈ పాటలో హీరోయిన్ మీనాెక్షి చౌదరితో రవితేజ మాస్ స్టెప్పులు అదిరిపోయాయి.

‘ఖిలాడి’ మూవీ విషయానికొస్తే.. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్  ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ’క్రాక్’ తర్వాత ఈ సినిమా రావడంతో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది.ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Liger First Glimpse Talk : విజయ్ దేవరకొండ ‘లైగర్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ టాక్.. ప్రధాని మోదీని ఆ విధంగా వాడుకున్న పూరీ జగన్నాథ్..


ఈ సినిమాతో పాటు రవితేజ మరో సినిమాను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటించనుందని టాక్.ఈ సినిమాతో పాటు రవితేజ వరుసగా పలు సినిమాలను అంగీకరిస్తూ.. షూటింగ్‌లను కంప్లీట్ చేస్తున్నారు. అందులో భాగంగా రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’  (Raviteja Ramarao On Duty) అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ మూవీని మార్చి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

Year Ender 2021 : ఈ యేడాది టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీని వేడెక్కించిన వివాదాలు..

ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చాలా రోజులకు వేణు తొట్టెంపూడి కూడా నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుందట. ఈ సినిమాను ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

Year Ender 2021 : అఖండ, ఉప్పెన, జాతి రత్నాలు సహా 2021లో లాభాలు తీసుకొచ్చిన సినిమాలు..

ఇక తాజాగా రవితేజ కెరీర్‌లో 70వ సినిమాని ప్రకటించారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మతో తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాకు టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రవితేజని “రావణాసుర” గా పరిచయం చేశారు. ఒక భారీ కపాలం పై కూర్చొన్నారు మాస్ మహా రాజ్. పోస్టర్‌లో రవితేజకు 9 తలలు ఉన్నాయి. ఇక ఆయన ఇటీవల ఓ ప్యాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావుగా వస్తోన్న సినిమాకు వంశీ దర్శకత్వం వహించనున్నారు.

First published:

Tags: Khiladi Movie, Meenakshi Chaudhary, Ramesh Varma, Ravi Teja, Tollywood

ఉత్తమ కథలు