Home /News /movies /

RAVI TEJA KHILADI MOVIE KHILADI DARK SUN GLASSES FOURTH SINGLE FULL KICK SONG OUT ON JAN 26TH JANUARY ON RAVI TEJA BIRTHDAY TA

Ravi Teja - Khiladi : ‘ఖిలాడి’ మూవీ నుంచి రవితేజ బర్త్ డే కానుక.. 4 పాటకు ముహూర్తం ఖరారు..

రవితేజ ‘ఖిలాడి’ మూవీ నుంచి నాల్గో పాటకు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

రవితేజ ‘ఖిలాడి’ మూవీ నుంచి నాల్గో పాటకు ముహూర్తం ఖరారు (Twitter/Photo)

Ravi Teja Khiladi | మాస్ మహారాజ్ రవితేజ గతేడాది ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’ మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి నాల్గో పాటను రవితేజ బర్త్ డే కానుకగా రిపబ్లిక్ డే రోజున విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇంకా చదవండి ...
    Ravi Teja - Khiladi |  మాస్ మహారాజ్ రవితేజ గతేడాది  ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కొత్త ఊపిరిని ఇచ్చింది. మరోవైపు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు.

    ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలను రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రవితేజ బర్త్ డే కానుకగా 4వ పాటను విడుదల చేయనున్నారు. ఈ పాట ఫుల్ కిక్ ఇచ్చే పాటగా మాస్ రాజా పుట్టినరోజున అభిమానులను అలరించే విధంగా ఉండబోతున్నట్టు టాక్.


    ‘ఖిలాడి’ మూవీ విషయానికొస్తే.. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్  ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ’క్రాక్’ తర్వాత ఈ సినిమా రావడంతో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది.ఈ సినిమాను  ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అదే డేట్ విడుదల చేస్తారా లేదా అనేది జనవరి 26న తేలిపోనుంది. ఈ చిత్రానికి  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    Allu Arjun - Pushpa : అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ మరో తిరుగులేని రికార్డు.. తగ్గేదేలే అంటున్న బన్ని..

    ‘ఖిలాడి’ సినిమాతో పాటు రవితేజ మూడు నాలుగు చిత్రాలను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటించనుందని టాక్.ఈ సినిమాతో పాటు రవితేజ  తన 68వ సినిమాగా ‘రామారావు’  (Raviteja Ramarao On Duty) అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ మూవీని మార్చి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

    Prabhas - Radhe Shyam : 1970 నాటి ఇట‌లీని రాధే శ్యామ్ లో ఎలా క్రీయేట్ చేశారు..? ఆర్ట్ డైరెక్ట‌ర్ చెప్పిన విశేషాలు.. ?

    ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చాలా రోజులకు వేణు తొట్టెంపూడి కూడా నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుందట. ఈ సినిమాను ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

    Unstoppable with NBK : బాలయ్య అన్‌స్టాపబుల్‌ స్పెషల్‌ ఎపిసోడ్.. ఈ సారి రచ్చ ఓ రేంజ్‌లో..

    దాంతో పాటు  రవితేజ కెరీర్‌లో 70వ సినిమాగా ‘రావణాసుర’ చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.   ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. వీటితో పాటు రవితేజ..  ఇటీవల ఓ ప్యాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావుగా వస్తోన్న సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు రవితేజ.. చిరంజీవి, బాబీ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. దీని కోసం భారీ స్థాయిలో పారితోషకం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Khiladi Movie, Ravi Teja, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు