Raviteja - Khiladi | మాస్ మహారాజ్ రవితేజ లాస్ట్ ఇయర్ 2021లో కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఆయనకు కొత్త ఊపిరిని ఇచ్చింది. మరోవైపు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ఇప్పటికే మూడు పాటలను విడుదల చేసిన టీమ్.. తాజాగా రవితేజ బర్త్ డే సందర్భంగా మరో సాంగ్‌ను విడుదల చేసింది. ఫుల్ కిక్కు అంటూ సాగే ఈ పాట నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ పాట సోషల్ మీడియాలో 5.7 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సాధించింది. అంతేకాదు 180k లైక్స్‌తో దూసుకుపోతోంది. దీంతో టీమ్ దీనికి సంబంధించి చిత్రబృందం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇక కరోనా నేపథ్యంలో చిరంజీవి ‘ఆచార్య’ సహా పలు సినిమాలు వాయిదా పడ్డాయి. అదే రూట్లో రవితేజ..‘ఖిలాడి’ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయనే టాక్ వినబడ్డాయి. వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ.. ఈ సినిమాను ఫిబ్రవరి 11న విడుదల చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా.. ఫిబ్రవరి 10 యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నట్టు ఓ పోస్టర్ రిలీజ్ చేసి మరోసారి విడుదల తేదిపై క్లారిటీ ఇచ్చారు. ఖిలాడి’ మూవీ విషయానికొస్తే.. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ’క్రాక్’ తర్వాత ఈ సినిమా రావడంతో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.
5 Million Views & 180K+ likes ? #FullKickU ? ? https://t.co/BTbO02nAlV#Khiladi #KhiladiFromFeb11th2022 @RaviTeja_offl @DirRameshVarma @ThisIsDSP #SekharMaster @Meenakshiioffl @DimpleHayathi @sagar_singer @ShreeLyricist #KoneruSatyanarayana @idhavish @murale_krisshna pic.twitter.com/mBK0L8fk6v
— PEN INDIA LTD. (@PenMovies) January 30, 2022
ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ‘ఖిలాడి’ సినిమాతో పాటు రవితేజ మూడు నాలుగు చిత్రాలను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటించనుందని టాక్.ఈ సినిమాతో పాటు రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’ (Raviteja Ramarao On Duty) అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని మార్చి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చాలా రోజులకు వేణు తొట్టెంపూడి కూడా నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుందట. ఈ సినిమాను ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
Janhvi Kapoor : జిమ్ లుక్‌లో మరోసారి అదరగొట్టిన శ్రీదేవి కూతురు.. జాన్వీ పిక్స్ వైరల్..
దాంతో పాటు రవితేజ కెరీర్‌లో 70వ సినిమాగా ‘రావణాసుర’ చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. వీటితో పాటు రవితేజ.. ఇటీవల ఓ ప్యాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావుగా వస్తోన్న సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు రవితేజ.. చిరంజీవి, బాబీ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు ‘విక్రమార్కుడు’ సీక్వెల్ ను సంపత్ నంది దర్శకత్వంలో చేయనున్నట్టు సమాచారం.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dimple hayathi, Khiladi Movie, Raviteja, Tollywood news