హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja - Khiladi: రవితేజ పుట్టినరోజు సందర్భంగా ‘ఖిలాడి’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల..

Ravi Teja - Khiladi: రవితేజ పుట్టినరోజు సందర్భంగా ‘ఖిలాడి’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల..

‘ఖిలాడి’గా రవితేజ (Twitter/Photo)

‘ఖిలాడి’గా రవితేజ (Twitter/Photo)

Ravi Teja - Khiladi First Glimpse:  2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసాడు. ఈ సినిమా ఈ యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ రోజు రవితేజ బర్త్ డే సందర్భంగా ఖిలాడి మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసారు.

  Ravi Teja - Khiladi First Glimpse:  2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసాడు. ఈ సినిమా ఈ యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు రవితేజకు మంచి పుట్టినరోజు బహుమతిగా ఈ సినిమా నిలిచిపోయింది. అంతేకాదు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసాడు. ఆ సంగతి పక్కనపెడితే.. రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ రోజు రిపబ్లిక్ డే రోజున రవితేజ బర్త్ డే సందర్భంగా ‘ఖిలాడీ’ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసారు.

  ‘ఖిలాడి’ పేరుతోనే మరరోసారి రవితేజ..తనదైన మాస్ యాక్షన్ ఎంటర్టేనర్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ఖిలాడి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు.

  మరోవైపు ప్రణీత ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం.ఈసైకో థ్రిల్లర్ ని అంతే గ్రిప్పింగ్‌గా రీమేక్ చేసిన దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. హవీష్ ప్రొడక్షన్స్ .. బాలీవుడ్‌కి చెందిన పెన్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఖిలాడీ చిత్రంలో మరోసారి రవితేజ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా కూడా తమిళంలో హిట్టైన ఓ సినిమాకు రీమేక్ అని చెబుతున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Krack, Ravi Teja, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు