Home /News /movies /

RAVI TEJA KHILADI MOVIE CENSOR COMPLETES AND RUN TIME 154 MINITS AND PRE RELEASE BUSINESS OF KHILADI MOVIE TA

Ravi Teja - Khiladi : రవితేజ ‘ఖిలాడి’ మూవీ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్‌తో పాటు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..

రవితేజ ‘ఖిలాడి’ సెన్సార్ పూర్తి.. ప్రీ రిలీజ్ బిజినెస్ (Twitter/Photo)

రవితేజ ‘ఖిలాడి’ సెన్సార్ పూర్తి.. ప్రీ రిలీజ్ బిజినెస్ (Twitter/Photo)

Ravi Teja - Khiladi : రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’. తాజాగా ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. మరోవైపు ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఏ రేంజ్ బిజినెస్ చేసిందంటే..

  Raviteja - Khiladi |  మాస్ మహారాజ్ రవితేజ  లాస్ట్ ఇయర్ 2021లో కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత  ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఆయనకు కొత్త ఊపిరిని ఇచ్చింది. మరోవైపు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ‘ఖిలాడి’ మూవీ టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.  అంతేకాదు ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. రన్ టైమ్ 154 నిమిషాలు ( 2గంటల 34 నిమిషాలు) ఉంది.

  రవితేజ ‘ఖిలాడి’ మూవీ సెన్సార్ పూర్తి (Twitter/Photo)


  ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించారు.  అనసూయ కీలక పాత్రలో నటించింది.. ఇక కరోనా నేపథ్యంలో చిరంజీవి ‘ఆచార్య’ సహా పలు సినిమాలు వాయిదా పడ్డాయి. అదే రూట్లో రవితేజ..‘ఖిలాడి’ మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయనే టాక్ వినబడ్డాయి.

  Mahesh Babu - Sarkaru Vaari Paata : ‘సర్కారు వారి పాట’ నుంచి మహేష్ బాబు, కీర్తి సురేష్ రొమాంటిక్ పాటకు ముహూర్తం ఫిక్స్..

  వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ.. ఈ సినిమాను ఫిబ్రవరి 11న థియేటర్స్‌లో పలకరించనుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు.   ఫిబ్రవరి 10 యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. మరి కాసేపట్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక పార్క్ హయత్ హోటల్‌లో జరగనుంది. ఈ వేడుకకు సినిమాకు సంబంధించిన వాళ్లే హాజరు కానున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ఎంత బిజినెస్ చేసిందంటే..

  నైజాం (తెలంగాణ) : రూ. 8 కోట్లు..
  సీడెడ్ (రాయలసీమ) : రూ. 3.50 కోట్లు
  ఆంధ్ర ప్రదేశ్ : మొత్తం రూ. 10 కోట్లు..

  తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ : మొత్తంగా రూ. 21.50 కోట్లు..
  కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: రూ. 2.10 కోట్లు
  ఓవర్సీస్ : రూ. 1.2 కోట్లు..                                                                                                                          వరల్డ్ వైడ్ ’ఖిలాడి’ మూవీ బిజినెస్ : రూ. 24.80 కోట్లు..                                                                బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ. 25.50 కోట్లు.. హిందీలో ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు.

  ఖిలాడి’ మూవీ విషయానికొస్తే.. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్  ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు. ’క్రాక్’ తర్వాత ఈ సినిమా రావడంతో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ‘ఖిలాడి’ సినిమాతో పాటు రవితేజ మూడు నాలుగు చిత్రాలను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటించనుందని టాక్.ఈ సినిమాతో పాటు రవితేజ  తన 68వ సినిమాగా ‘రామారావు’  (Raviteja Ramarao On Duty) అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ మూవీని మార్చి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

  HBD Sumanth : వాళ్లిద్దరితో నటించడమే సుమంత్ సినీ కెరీర్‌లో చేసిన అతి పెద్ద తప్పట..

  ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చాలా రోజులకు వేణు తొట్టెంపూడి కూడా నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుందట. ఈ సినిమాను ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

  Ravi Teja,Ravi Teja twitter,Ravi Teja instagram,Ravi Teja movies,Ravi Teja khiladi movie bollywood,Mass Raja Ravi Teja Khiladi movie will release simultaneously in Bollywood also along with Telugu Feb 11th,Ravi Teja Khiladi in Hindi,Ravi Teja bollywood entry,telugu cinema,రవితేజ,రవితేజ ఖిలాడి,రవితేజ ఖిలాడి సినిమా బాలీవుడ్,హిందీలో విడుదలవుతున్న రవితేజ ఖిలాడి
  రవితేజ ‘ఖిలాడి’ (Twitter/Photo)


  దాంతో పాటు  రవితేజ కెరీర్‌లో 70వ సినిమాగా ‘రావణాసుర’ చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. వీటితో పాటు రవితేజ..  ఇటీవల ఓ ప్యాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావుగా వస్తోన్న సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు రవితేజ.. చిరంజీవి, బాబీ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు ‘విక్రమార్కుడు’ సీక్వెల్ ను సంపత్ నంది దర్శకత్వంలో చేయనున్నట్టు సమాచారం.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood news, Khiladi Movie, Ravi Teja, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు