హోమ్ /వార్తలు /సినిమా /

రవితేజ క్రేజీ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు..

రవితేజ క్రేజీ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు..

రవితేజ (File Photo)

రవితేజ (File Photo)

ప్రస్తుతం మాస్ రాజా రవితేజ.. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు. మరోవైపు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ముహూర్తం ఖరారైంది.

ప్రస్తుతం మాస్ రాజా రవితేజ.. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ రెండు షేడ్స్ వున్న పాత్రలు చేస్తున్నట్టు సమాచారం. అందులో ఒక పాత్ర కోసం రవితేజ.. మరి యంగ్‌గా కనిపించాలి. దీనికోసం మాస్‌రాజా బాగానే వర్కౌట్ చేసి తన లుక్‌ను మార్చుకున్నాడు. మరోకటి ముసలి క్యారెక్టర్. ఈ సినిమా షూటింగ్ ఆల్మొస్ట్  కంప్లీట్ కానీకొచ్చింది. ఈ సినిమా తర్వాత రవితేజ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పాడు. దీపావళి సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసాడు. ఈ  సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ నటిస్తోంది. మరోవైపు తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. తాజాగా ఈ సినిమా నవంబర్ 14న ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. హీరోగా రవితేజకు ఇది 66వ సినిమా. ఇందులో మాస్ రాజా మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ  సినిమా తమిళంలో హిట్టైయిన సినిమాకు రీమేక్ అని చెబుతున్నారు.

First published:

Tags: Disco Raja, Gopichand malineni, Raviteja, Shruti haasan, Telugu Cinema, Tollywood, Varalaxmi Sarathkumar, VI Anand

ఉత్తమ కథలు