Ravi Teja: ‘క్రాక్’ వాయిదా విషయంలో రవితేజ హర్ట్.. నిర్మాతపై సీరియస్..?

రవితేజ క్రాక్ (Ravi Teja Krack)

Ravi Teja: క్రాక్ సినిమా అనుకున్నట్లు విడుదలై ఉంటే కచ్చితంగా కలెక్షన్స్ భారీగానే వచ్చేవి. కరోనా వైరస్ ఉన్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ దగ్గర అభిమానులు భారీగానే గుమిగూడారు. వైరస్‌ను ఏ మాత్రం లెక్క చేయకుండా అభిమానులతో..

  • Share this:
క్రాక్ సినిమా అనుకున్నట్లు విడుదలై ఉంటే కచ్చితంగా కలెక్షన్స్ భారీగానే వచ్చేవి. కరోనా వైరస్ ఉన్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్స్ దగ్గర అభిమానులు భారీగానే గుమిగూడారు. వైరస్‌ను ఏ మాత్రం లెక్క చేయకుండా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా థియేటర్స్ దగ్గరకు క్యూ కట్టారు. హైదరాబాద్, వైజాగ్ లాంటి సిటీస్ కాకుండా చిన్న ఊళ్ళలో కనీసం రెండు థియేటర్స్‌లో విడుదలైంది క్రాక్. చాలా రోజుల తర్వాత వస్తున్న భారీ సినిమా కావడంతో దాదాపు 80 శాతం థియేటర్స్‌లో క్రాక్ బొమ్మ కనిపించింది. పైగా మాస్ సినిమా కావడంతో కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా పండక్కి నెత్తిన పెట్టుకునే వాళ్లు ఫ్యాన్స్. అన్నింటికి మించి పోటీ లేకుండా వచ్చింది క్రాక్. జనవరి 9న క్రాక్ వస్తుంటే.. 13న మాస్టర్, 14న రెడ్ సినిమాలు విడుదల కానున్నాయి. మూడు నాలుగు రోజుల గ్యాప్ కూడా ఉండటంతో రవితేజ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయం అనుకున్నారంతా. అలాంటి సమయంలో అనుకోకుండా సినిమా వాయిదా పడటంతో అభిమానులు మాత్రమే కాదు.. రవితేజ కూడా హర్ట్ అయ్యాడని తెలుస్తుంది. నిర్మాత ఠాగూర్ మధు తీరుతో మాస్ రాజా హర్ట్ అయ్యాడని.. ముందే ఇవన్నీ చూసుకోకపోతే ఎలా అంటూ సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతుంది.
ravi teja krack movie,ravi teja krack movie review,ravi teja krack movie public talk,ravi teja krack movie shows cancel,ravi teja krack movie collections,ravi teja krack movie gopichand malineni,telugu cinema,ravi teja krack movie release postponed,రవితేజ క్రాక్,క్రాక్ సినిమా విడుదల వాయిదా,క్రాక్ సినిమా రివ్యూ
‘క్రాక్’లో రవితేజ (Raja Krack movie)

చిన్న క్లారిటీ మిస్ కావడం వల్ల భారీ నష్టాలు వస్తాయని ఆయన ఫీల్ అవుతున్నాడు. విడుదలపై సందిగ్ధత ఉండటంతో వసూళ్లపై అది దారుణమైన ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. వీలైనంత త్వరగా ఆర్థిక ఇబ్బందులను తొలగించి సినిమా విడుదలయ్యేలా చూడాలని నిర్మాతలకు రవితేజ గట్టిగానే సూచించినట్లు తెలుస్తుంది. మరి చూడాలిక.. ఈ ఆలస్యం క్రాక్ కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపించబోతుందో..?
Published by:Praveen Kumar Vadla
First published: