రాజా ది గ్రేట్ తర్వాత సరైన సక్సెస్ లేని మాస్ మహారాజ్ రవితేజ.. తాజాగా సక్సెస్ కోసం అక్షయ్ కుమార్‌ను నమ్ముకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వరస ఫ్లాపులు వస్తున్నా కూడా రవితేజ జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ వరస సినిమాలతో సత్తా చూపిస్తున్నాడు. అంతకు ముందు యేడాది "టచ్ చేసి చూడు".. "నేలటికెట్".. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాలతో వచ్చాడు మాస్ రాజా. "రాజా ది గ్రేట్"తో రెండేళ్ల తర్వాత వచ్చి హిట్ కొట్టిన ఈ హీరో.. ఆ తర్వాత మాత్రం అదే టెంపో కొనసాగించలేకపోయాడు. ఈయన సినిమాలు కనీసం 10 కోట్ల మార్క్ అందుకోలేక చేతులెత్తేస్తున్నాయి. ఈ యేడాది మాత్రం ‘డిస్కో రాజా’ సినిమాతో పలకరించాడు. కానీ ఈ సినిమా మాస్ రాజాకు హిట్టు ఇవ్వలేకపోయింది.
ప్రస్తుతం రవితేజ.. గోపిచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు క్రాక్ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. క్రాక్ సినిమాతో పాటు రవితేజ.. రీసెంట్గా బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘రాక్షసుడు’ రీమేక్ తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో నెక్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాకు అక్షయ్ కుమార్‌కు హీరోగా బ్రేక్ ఇచ్చిన ఖిలాడీ టైటిల్ అనుకుంటున్నారు. దాదాపు ఇదే ఖరారయ్యే అవకాశాలున్నాయి. మరి ఖిలాడీ సినిమాతోనైనా హీరోగా రవితేజ నిజంగానే హిట్టు కొట్టి ఖిలాడీ అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Ravi Teja, Telugu Cinema, Tollywood