హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja: రవితేజ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్.. యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్ రాబట్టిన సినిమా..

Ravi Teja: రవితేజ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్.. యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్ రాబట్టిన సినిమా..

రవితేజ (Twitter/Photo)

రవితేజ (Twitter/Photo)

Ravi Teja | ఒక్కోసారి ఫ్లాపు మూవీలు కూడా ఆయా హీరోల కెరీర్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి. ఇక రవితేజ కెరీర్‌లో డిజాస్టర్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిన ఓ సినిమా ఇపుడు యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఇంకా చదవండి ...

  Ravi Teja | ఒక్కోసారి ఫ్లాపు మూవీలు కూడా ఆయా హీరోల కెరీర్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంటాయి. ఇక రవితేజ కెరీర్‌లో డిజాస్టర్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిన ఓ సినిమా ఇపుడు యూట్యూబ్‌లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే... మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు. అదే రేంజ్‌లో ఫ్లాప్స్‌ను మూటగట్టుకున్నాడు. అలా రవితేజ కెరీర్‌లో అత్యంత తక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ‘నేల టిక్కెట్’ సినిమా ఒకటి.  సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సామాన్య ప్రేక్షకులతో పాటు నేల టిక్కెట్టు’ ప్రేక్షకులను మెప్పిండంలో విఫలమైంది.

  అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ‘నేల టిక్కెట్’ సినిమా హిందీలో అదే ‘నేల టిక్కెట్’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఈ సినిమా యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్ రాబట్టి ఔరా అనిపించింది. గతేడాది మే‌లో ఈ సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసారు. దాదాపు యేడాదిన్నర తర్వాత ఈ సినిమా యూట్యూబ్‌లో 100 మిలియన్  వ్యూస్ రాబట్టింది. అంతేకాదు హీరోగా  రవితేజ కెరీర్‌లోనే యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ రాబట్టిన సినిమాగా ‘నేల టిక్కెట్టు’ సినిమా రికార్డులకు ఎక్కింది. మొత్తంగా మన దగ్గర ఫ్లాపైన చాలా చిత్రాలు.. హిందీ డబ్బింగ్ వెర్షన్‌లో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. అందులో రవితేజ సినిమా కూడా చేరింది. మొత్తంగా హిందీ డబ్బింగ్ వెర్షన్స్‌తో మన తెలుగు హీరోలు యూట్యూబ్ వేదికగా బాగానే ఇరగదీస్తున్నారనే చెప్పాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ravi Teja, Tollywood

  ఉత్తమ కథలు