హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja: ఒకే రోజు రవితేజ డబుల్ ధమాకా.. క్రాక్ పుట్టిస్తోన్న మాస్ మహారాజా..

Ravi Teja: ఒకే రోజు రవితేజ డబుల్ ధమాకా.. క్రాక్ పుట్టిస్తోన్న మాస్ మహారాజా..

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ.. ఈ రోజు ( ఫిబ్రవరి 5 )న డబుల్ ధమాకా ఇవ్వనున్నాడు. దీంతో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ.. ఈ రోజు ( ఫిబ్రవరి 5 )న డబుల్ ధమాకా ఇవ్వనున్నాడు. దీంతో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ.. ఈ రోజు ( ఫిబ్రవరి 5 )న డబుల్ ధమాకా ఇవ్వనున్నాడు. దీంతో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

  Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ.. ఈ రోజు ( ఫిబ్రవరి 5 )న డబుల్ ధమాకా ఇవ్వనున్నాడు. అవును మాస్ మహారాజ్ హీరోగా నటించిన క్రాక్ మూవీ ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. అంతేకాదు క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్స్ విషయంలో కుమ్మేసింది.రూ. 17.5 కోట్లకు అమ్ముడు పోయిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ క్రాస్ చేయడంతో పాటు రూ. 37 కోట్ల వరకు షేర్ సాధించింది. ఈ రకంగా ఈ  సినిమా  రూ. 20 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. దీంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరు ఎంతో హ్యాపీగా ఉన్నారు. రాజా ది గ్రేట్ తర్వాత సరైన హిట్ లేని రవితేజకు క్రాక్ మూవీ మరోసారి ఊపిరి పోసింది. ఈ చిత్రంతో చాలా ఏళ్ళ తర్వాత బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు మాస్ రాజా. సంక్రాంతి సీజన్‌లో పర్ఫెక్ట్ మాస్ సినిమా వస్తే కలెక్షన్స్ ఎలా వస్తాయో ఈ సినిమా నిరూపిస్తుంది. క్రాక్ వచ్చిన రోజు నుంచి కలెక్షన్స్ కిరాక్ పుట్టిస్తుంది. ప్యాండమిక్ కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఓపెన్ అయిన క్రాక్ రెండో రోజే 6.25 కోట్ల షేర్.. 10 కోట్లకు పైగా గ్రాస్ (తొలి రోజు నైట్ షోస్ మాత్రమే పడ్డాయి) వసూలు చేసింది.

  ఇప్పటికీ రోజుకు కనీసం చెప్పుకోదగ్గ వసూళ్లే వస్తున్నాయి. కరోనా టైమ్ కదా కాస్త తక్కువగా వస్తాయేమో వసూళ్లు అనుకుంటే.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ట్రేడ్‌కు కూడా షాక్ ఇస్తూ మంచి కలెక్షన్స్‌ను రాబడుతూనే ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా డిజిటల్ హక్కులు ‘ఆహా’ రూ. 8 .5 కోట్ల భారీ రేటుకే దక్కించుకుంది. ఆహా ఓ సినిమాను ఇన్ని డబ్బులు పోసి కొన్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా ఈ రోజు నుంచే ఆహాలో స్ట్రీమింగ్  కానుంది.

  అంతేకాదు.. క్రాక్ సినిమాను తమిళం, మలయాళ ప్రేక్షకుల కోసం ఆయా భాషల్లో డబ్ చేసారు. అంతేకాదు ఈ సినిమా తమిళ, మలయాళ వెర్షన్స్ ఈ రోజు నుంచి థియేటర్స్‌లో ప్రదర్శితం కానుంది. క్రాక్ అనేది యూనివర్సల్ టైటిల్ కాబట్టి ఈ సినిమాను ఆయా భాషల్లో అదే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు.

  ఫిబ్రవరి 5న క్రాక్ తమిళం, మలయాళం వెర్షన్స్ థియేటర్స్‌లో విడుదల(Twitter/Photo)

  ఇక హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. త్వరలో ఈ రీమేక్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలబడే అవకాశం ఉంది. మొత్తంగా రవితేజ.. ఒకేరోజు ఆహా ఓటీటీతో పాటు తమిళ, మలయాళ భాషల్లో పలకరిస్తున్నాడు.

  First published:

  Tags: Krack, Ravi Teja, Tollywood

  ఉత్తమ కథలు