Disco Raja : రవితేజ హీరోగా వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డిస్కో రాజా. ఈ సినిమా రవితేజ కెరీర్లోనే భారీ బడ్జెట్ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే గోవాలో 15 రోజులు పాటు కొన్ని కీలక సన్నివేశాల్నీ షూట్ చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఫారిన్ వెళ్లేందుకు డిస్కో రాజా టీం రెడీ అవుతున్నట్లు నిర్మాత రామ్ తళ్ళూరి తెలిపారు. యూరోప్‌లోని ఐస్ ల్యాండ్‌లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రికరించనున్నారు. ఈ తాజా షెడ్యూల్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో 4 నిమిషాలు ఉండే ఓ సన్నివేశం కోసం దాదాపు రూ.5 కోట్లు ఖర్చు చేయనున్నారట.
అందుకోసం హలీవుడ్ సినిమా 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’కు పనిచేసిన టీమ్‌ను ఉపయోగిస్తున్నారు. వీటికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంటాయని చెబుతోంది చిత్ర బృందం. రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేషా హీరోయిన్స్‌గా చేస్తున్నారు. డిసెంబర్ 20న డిస్కో రాజా విడుదల కాబోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ravi Teja, Telugu Cinema News