హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja | Khiladi Twitter Review : రవితేజ ఖిలాడి ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

Ravi Teja | Khiladi Twitter Review : రవితేజ ఖిలాడి ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

Khiladi Twitter Review Photo : Twitter

Khiladi Twitter Review Photo : Twitter

Ravi Teja | Khiladi Twitter Review : రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈరోజు అంటే ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్స్ పడడంతో టాక్ బయటకు వచ్చింది.

ఇంకా చదవండి ...

Raviteja - Khiladi |  మాస్ మహారాజ్ రవితేజ  (Ravi Teja) లాస్ట్ ఇయర్ 2021లో కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత  ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఆయనకు కొత్త ఊపిరిని ఇచ్చింది. మరోవైపు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో (Ravi Teja) ‘ఖిలాడి’  (Khiladi Twitter Review) సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈరోజు అంటే ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్స్ పడడంతో టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడయా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అసలు సినిమా ఎలా ఉంది.. కథేంటీ.. రవితేజకు(Ravi Teja) మరో హిట్ పడనుందా.. తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఎంత మేరకు ఆకట్టుకోలదు వంటి అంశాలను పంచుకుంటున్నారు.. అవేంటో చూద్దాం..

ఇక ఇప్పటికే విడుదలైన ‘ఖిలాడి’ మూవీ టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.  అంతేకాదు ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో ఒకేసారి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. రన్ టైమ్ 154 నిమిషాలు ( 2గంటల 34 నిమిషాలు) ఉంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించారు.  అనసూయ కీలక పాత్రలో నటించింది.

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ఎంత బిజినెస్ చేసిందంటే.. నైజాం (తెలంగాణ) : రూ. 8 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ) : రూ. 3.50 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ : మొత్తం రూ. 10 కోట్లు, తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ : మొత్తంగా రూ. 21.50 కోట్లు..

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: రూ. 2.10 కోట్లు, ఓవర్సీస్ : రూ. 1.2 కోట్లు, వరల్డ్ వైడ్ ’ఖిలాడి’ మూవీ బిజినెస్ : రూ. 24.80 కోట్లు చేసింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే.. రూ. 25.50 కోట్లు రాబట్టాలి. ఇక హిందీలో ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు.

ఖిలాడి’ మూవీ విషయానికొస్తే.. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్  ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు. ’క్రాక్’ తర్వాత ఈ సినిమా రావడంతో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ‘ఖిలాడి’ సినిమాతో పాటు రవితేజ మూడు నాలుగు చిత్రాలను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటించనుందని టాక్.ఈ సినిమాతో పాటు రవితేజ  తన 68వ సినిమాగా ‘రామారావు’  (Raviteja Ramarao On Duty) అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ మూవీని మార్చి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చాలా రోజులకు వేణు తొట్టెంపూడి కూడా నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుందట. ఈ సినిమాను ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

Poorna : మరోసారి అందంగా అదరగొట్టిన మలయాళీ బ్యూటీ పూర్ణ.. వావ్ అనాల్సిందే..

దాంతో పాటు  రవితేజ కెరీర్‌లో 70వ సినిమాగా ‘రావణాసుర’ చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. వీటితో పాటు రవితేజ..  ఇటీవల ఓ ప్యాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావుగా వస్తోన్న సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు రవితేజ.. చిరంజీవి, బాబీ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు ‘విక్రమార్కుడు’ సీక్వెల్ ను సంపత్ నంది దర్శకత్వంలో చేయనున్నట్టు సమాచారం.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Dimple hayathi, Khiladi Movie, Ravi Teja, Tollywood news

ఉత్తమ కథలు