Home /News /movies /

RAVI TEJA DIMPLE HAYATHI KHILADI STREAMING ON HOTSTAR FROM TODAY HERE ARE THE DETAILS SR

Ravi Teja | Khiladi : ప్రముఖ ఓటీటీలో రవితేజ ఖిలాడి.. ఈరోజు నుంచి స్ట్రీమింగ్..

Ravi Teja Khiladi on Hotstar Photo : Twitter

Ravi Teja Khiladi on Hotstar Photo : Twitter

Ravi Teja | Khiladi on Hotstar : రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో (Ravi Teja) ‘ఖిలాడి’  (Khiladi) సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

ఇంకా చదవండి ...
    Raviteja Khiladi on Hotstar | మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) లాస్ట్ ఇయర్ 2021లో కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఆయనకు కొత్త ఊపిరిని ఇచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో (Ravi Teja) ‘ఖిలాడి’ (Khiladi) సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఖిలాడి మార్చి 11న అంటే ఈరోజు నుంచి హాట్ స్టార్‌లో ఆరు గంటల నుంచి (Khiladi on Hotstar) స్ట్రీమింగ్ అవుతోంది. చూడాలి మరి అక్కడ ఎలా రెస్పాన్స్ దక్కించుకోనుందో.. ఇక ఈ సినిమాలో డింపుల్ హయాతీ (Dimple Hayathi), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించారు. యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు.

    ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. రవితేజ మూడు నాలుగు చిత్రాలను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’ (Raviteja Ramarao On Duty) అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చాలా రోజులకు వేణు తొట్టెంపూడి కూడా నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుందట. ఈ సినిమాను ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.


    దాంతో పాటు రవితేజ కెరీర్‌లో 70వ సినిమాగా ‘రావణాసుర’ చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. వీటితో పాటు రవితేజ.. ఇటీవల ఓ ప్యాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావుగా వస్తోన్న సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Khiladi Movie, Raviteja, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు