రవితేజ న్యూ ఇయర్ గిప్ట్.. క్రాక్ పుట్టిస్తున్న మాస్ మహారాజ్..

క్రాక్: రవితేజ, శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ సినిమా కూడా ఓటిటిలోనే రానుందనే ప్రచారం జరుగుతుంది.

 2018లో వరుసగా హాట్రిక్ ఫ్లాపుల తర్వాత రవితేజ.. తన సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

 • Share this:
  2018లో వరుసగా హాట్రిక్ ఫ్లాపుల తర్వాత రవితేజ.. తన సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే మాస్ మహారాజ్.. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 24న రిపబ్లిక్ డే కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో మాస్ రాజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ నటిస్తోంది. ఈ చిత్రంలో మరోసారి రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.   మరోవైపు రవితేజ.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమ ా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ..మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ చిత్రాన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

  ravi teja crack new look poster released due to new year 2020,happy new year 2020,ravi teja,ravi teja new year gift,ravi teja crack,raviteja Ravi Teja and Gopichand malineni new movie titled as krack,ravi teja,ravi teja movies,ravi teja new movie,ravi teja gopichand malineni new movie title krack,ravi teja and shrushi hassan new movie title krack,ravi teja new movies,ravi teja gopichand malineni movie updates,ravi teja gopichand malineni movie,ravi teja upcoming movies,ravi teja 66 movie title krack,ravi teja movie,ravi teja 66 movie title fix krack,ravi teja new movie title,క్రాక్‌గా రవితేజ,రవితేజ క్రాక్,క్రాక్ లుక్‌లో రవితేజ లుక్
  రవితేజ క్రాక్ న్యూ లుక్ (Twitter/Photo)


  క్రాక్‌లో రవితేజ సరసన అందాల తార శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్‌ నటిస్తున్నారు. తమిళ నటుడు సముద్రఖని మరో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: