హోమ్ /వార్తలు /సినిమా /

రేటులో రిబేటు.. రవితేజకు కావాలి ఒక్క హిట్టు

రేటులో రిబేటు.. రవితేజకు కావాలి ఒక్క హిట్టు

రవితేజ విఐ ఆనంద్

రవితేజ విఐ ఆనంద్

వరుస ఫ్లాప్‌లు రావడంతో హీరో రెమ్యూనరేషన్ మీద దెబ్బ పడింది. హీరో డిమాండ్ చేసినంతగా నిర్మాతలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ‘ఎంతో కొంత’కు కాంప్రమైజ్ కాక తప్పడం లేదు మాస్ మహారాజాకి.

మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాప్‌లతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకప్పుడు ఖడ్గం సినిమాలో ‘ఒక్క చాన్స్ ప్లీజ్’ అని అడిగినట్టు ఇప్పుడు ‘ఒక్క హిట్టు ప్లీజ్’ అంటున్నాడు. ఒకప్పుడు ఇష్టారాజ్యంగా సాగిన రెమ్యూనరేషన్ ఇప్పుడు మాత్రం చాలా తగ్గిపోయింది అని తెలుస్తుంది. నిర్మాతలు అడిగినంత ఇవ్వడానికి అసలు సిద్ధంగా లేరు. వరుస ప్లాపులు రవితేజ మార్కెట్ను బాగా దెబ్బతీశాయి. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కూడా దాదాపు పది కోట్ల రెమ్యునరేషన్ అందుకున్న రవితేజ ఇప్పుడు ఆనంద్ సినిమా కోసం అందులో సగం కూడా తీసుకోవటం లేదని తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాత రామ్ తల్లూరు రవితేజ అడిగిన పారితోషికానికి ఒప్పుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో రూ.5 కోట్లతో రవితేజ సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది.

Ravi Teja compromised to reduce Remuneration after consecutive flops | వరుస ఫ్లాప్‌లు రావడంతో హీరో రెమ్యూనరేషన్ మీద దెబ్బ పడింది. హీరో డిమాండ్ చేసినంతగా నిర్మాతలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ‘ఎంతో కొంత’కు కాంప్రమైజ్ కాక తప్పడం లేదు మాస్ మహారాజాకి. Ravi Teja Remuneration cut, Ravi Teja, Ravi Teja pay cut, Ravi Teja next movie, రవితేజ, రవితేజ తర్వాత సినిమా, రవితేజ రెమ్యూనరేషన్ కోత,
మైత్రి మూవీ మేకర్స్‌లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ

ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నడూ లేనంత ప్రయోగాత్మకత కథతో ఈ సినిమా చేయబోతున్నాడు మాస్ రాజా. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. కిక్ 2 సినిమా తరహాలో తండ్రి కొడుకులుగా నటించబోతున్నాడు మాస్ రాజా. పాయల్ రాజ్‌పుత్, యాంకర్ అందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఎక్కడికి పోతావు చిన్నవాడా?, ఒక్కక్షణం వంటి విభిన్న చిత్రాల తర్వాత వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.

Ravi Teja compromised to reduce Remuneration after consecutive flops | వరుస ఫ్లాప్‌లు రావడంతో హీరో రెమ్యూనరేషన్ మీద దెబ్బ పడింది. హీరో డిమాండ్ చేసినంతగా నిర్మాతలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ‘ఎంతో కొంత’కు కాంప్రమైజ్ కాక తప్పడం లేదు మాస్ మహారాజాకి. Ravi Teja Remuneration cut, Ravi Teja, Ravi Teja pay cut, Ravi Teja next movie, రవితేజ, రవితేజ తర్వాత సినిమా, రవితేజ రెమ్యూనరేషన్ కోత,
ఎక్కడికి పోతావ్ చిన్నవాడా పోస్టర్

ఈ సినిమాకు ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. రవితేజ కెరీర్ గాడిన పడాలంటే ఈ సినిమా విజయం సాధించాల్సిందే. రవితేజకు మరో ఆప్షన్ కూడా లేదు. ఏదైనా తేడా జరిగితే డిస్కో రాజా గాడి తప్పితే రవితేజను పూర్తిగా మర్చిపోవచ్చు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ravi Teja, Tollywood news

ఉత్తమ కథలు