హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja Kick @ 12 years: ‘కిక్’ సినిమాకు 12 ఏళ్లు.. ఆ రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..?

Ravi Teja Kick @ 12 years: ‘కిక్’ సినిమాకు 12 ఏళ్లు.. ఆ రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..?

కిక్ సినిమాకు 12 ఏళ్ళు (Kick movie)

కిక్ సినిమాకు 12 ఏళ్ళు (Kick movie)

Ravi Teja Kick @ 12 years: రవితేజ మార్కెట్‌ను ఒక్క సినిమాతో డబుల్ చేసిన సినిమా కిక్(Kick movie). అప్పటి వరకు ఈయన మార్కెట్ 15 కోట్లు మాత్రమే. అలాంటి సమయంలో విడుదలైన కిక్ సినిమా రవితేజ మార్కెట్‌ను అమాంతం పెంచేసింది. ఆ రోజుల్లోనే ఈ చిత్రం 23 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇంకా చదవండి ...

రవితేజ మార్కెట్‌ను ఒక్క సినిమాతో డబుల్ చేసిన సినిమా కిక్. అప్పటి వరకు ఈయన మార్కెట్ 15 కోట్లు మాత్రమే. అంతకుమించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ రాలేదు. బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చినా కూడా మాస్ రాజా మాత్రం అక్కడే ఆగిపోయాడు. అలాంటి సమయంలో వచ్చింది కిక్. అదిరిపోయే కామెడీ.. అద్భుతమైన సెంటిమెంట్.. దానికితోడు పిచ్చితో కిక్ పిచ్చెక్కించింది. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం 2009, మే 8న విడుదలైంది. అంటే సరిగ్గా 12 ఏళ్ల క్రితం అన్నమాట. ఈ సినిమాతోనే తమన్ కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈయన మొదటి సినిమా కూడా ఇదే. తొలి సినిమాతోనే పాటలతోనే కాకుండా బ్యాగ్రౌండ్ స్కోర్‌తో పిచ్చెక్కించాడు థమన్. అప్పుడు మొదలైన వాయింపు ఇప్పటికీ ఆగడం లేదు. ఈ 12 ఏళ్ళలో 125 సినిమాలకు పైగానే సంగీతం అందించాడు. మరోవైపు కిక్ ఆ రోజుల్లోనే 23 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా పుష్కరం పూర్తి చేసుకున్న సందర్భంగా రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ‘#12YearsForKick’ ‘#12YearsOfKICKMadness’ హ్యాష్ ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. కిక్ అప్పట్లో వసూలు చేసిన మొత్తం ఇప్పుడు చూద్దాం..

నైజాం-7.53 కోట్లు

సీడెడ్-2.72 కోట్లు

ఉత్తరాంధ్ర- 3.12 కోట్లు

ఈస్ట్- 0.94 కోట్లు

వెస్ట్- 0.92 కోట్లు

గుంటూరు- 1.7 కోట్లు

కృష్ణా- 1.03 కోట్లు

నెల్లూరు- 0.84 కోట్లు

ఏపీ + తెలంగాణ మొత్తం- 18.89 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 3.86 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్- 22.75 కోట్లు

ravi teja,ravi teja twitter,ravi teja instagram,ravi teja kick movie,ravi teja kick movie 12 years completed,ravi teja kick movie final collections,రవితేజ,రవితేజ కిక్ సినిమా,రవితేజ కిక్ సినిమా ఫైనల్ కలెక్షన్స్,రవితేజ కిక్ 12 ఏళ్లు
కిక్ సినిమాకు 12 ఏళ్ళు (Kick movie)

‘కిక్’ సినిమాను అప్పట్లో రవితేజ మార్కెట్ రేంజ్ కు తగ్గట్లుగానే 13.77 కోట్లకు అమ్మారు. అంటే 15 కోట్లు వస్తే సేఫ్ అన్నమాట. అలాంటి సమయంలో ఈ సినిమా 12 ఏళ్ల కిందే 22.75 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే బయ్యర్లకు 8.95 కోట్ల లాభాలు తీసుకొచ్చిందన్నమాట. ఆ ఏడాది విడుదలైన సినిమాల్లో మగధీర, అరుందతి తర్వాత అత్యధిక లాభాలను మిగిల్చిన సినిమా ఇదే. రవితేజ మార్కెట్ ను ఒకేసారి రెండింతలు పెంచేసింది కిక్.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ravi Teja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు