Ravi Teja As Rama Rao : రామారావు పాత్రలో రవితేజ. మాస్ మహారాజ్ ఏంటి రామారావు ఏంటి కంగారు పడకండి. క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా సినిమాలు సినిమాలు చేస్తున్నారు రవితేజ. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తున్నారు. ఇందులో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘ఖిలాడి’ మూవీ సెట్స్ పై ఉండగానే రవితేజ శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో మరో సినిమాను స్టార్ట్ చేశారు. తెలుగు సంవత్సరం 'ఉగాది' పండుగను పురస్కరించుకుని కొత్త సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. రీసెంట్‌గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు ‘రామారావు’ అనే టైటిల్ ఖరారు చేశారు. అంతేకాదు ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రామారావు ‘ఆన్ డ్యూటీ’ అంటూ విడుదల చేసిన పోస్టర్స్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. రవితేజ సరసన హీరోయిన్’గా నాగ చైతన్య 'మజిలీ' సినిమాతో పరిచయమైన 'దివ్యాంశ కౌశిక్' నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసిందట చిత్రబృందం. మొదటి షెడ్యూల్‌లో రవితేజపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నేను భారత దేశ సార్వభౌమాధికరం, రాజ్యాంగం ప్రకారం నా విధి నిర్వహిస్తానని ఉంది. ఓ ఎమ్మార్వో అవినీతి రాజకీయ నాయకులను ఎలా భరతం పట్టాడనే కథనంతో ఈ సినిమా తెరకెక్కనుంది. మొత్తంగా రవితేజ సినిమాకు రామారావు అనే పవర్‌ఫుల్ టైటిల్ చాలా యాప్ట్‌గా ఉందంటున్నారు.
ఇందులో రవితేజ లుక్.. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా సరికొత్త మేకోవర్ తో కనిపించనున్నారు. నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్, ఎల్‌ఎల్‌పి బ్యానర్ లపై నిర్మితమవుతోంది.ఇక క్రాక్ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ఖిలాడి.. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఖిలాడిలో యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను పెన్ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంటుందని.. అందులో అందాల తార ప్రణీత నర్తించిందని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rama Rao, Ravi Teja, Sharath Mandava, Tollywood