RAVI TEJA AS RAMA RAO DIVYANSHA KAUSHIK AND RAJISHA VIJAYAN TO ROMANCE WITH RAVI TEJA TA
Ravi Teja As Rama Rao: రామారావు సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్.. అఫీషియల్ ప్రకటన..
రవితేజ ‘రామారావు’ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ (Twitter/Photo)
Ravi Teja As Rama Rao: ఈ ఇయర్ క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా సినిమాలు ఓకే చేస్తున్నారు రవితేజ. తాజాగా ‘రామారావు’ అనే పవర్ఫుల్ టైటిల్‌తో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ నటించే హీరోయిన్ ఖరారయ్యారు.
Ravi Teja As Rama Rao: ఈ ఇయర్ క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుసగా సినిమాలు ఓకే చేస్తున్నారు రవితేజ (Ravi Teja). ఇప్పటికే రమేష్ వర్మ (Ramesh Varma) దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తున్నారు. ఇందులో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘ఖిలాడి’ మూవీ సెట్స్ పై ఉండగానే రవితేజ శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో మరో సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.'ఉగాది' పండుగను పురస్కరించుకుని కొత్త సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక ఈ సినిమాకు ‘రామారావు’ అనే టైటిల్ ఖరారు చేశారు. అంతేకాదు ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రామారావు ‘ఆన్ డ్యూటీ’ అంటూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. రవితేజ సరసన హీరోయిన్’గా నాగ చైతన్య 'మజిలీ' సినిమాతో పరిచయమైన 'దివ్యాంశ కౌశిక్' నటిస్తోంది. మరో కథానాయిక రజిషా విజయన్ నటిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించారు.
దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ (Twitter/Photo)
ఈ చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసింది చిత్రబృందం. మొదటి షెడ్యూల్లో రవితేజపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.ఓ ఎమ్మార్వో అవినీతి రాజకీయ నాయకులను ఎలా భరతం పట్టాడనే కథనంతో ఈ సినిమా తెరకెక్కనుంది. మొత్తంగా రవితేజ సినిమాకు రామారావు అనే పవర్ఫుల్ టైటిల్ చాలా యాప్ట్‌గా ఉందంటున్నారు.ఈ చిత్రాన్ని వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.