Home /News /movies /

RAVI TEJA APSARA RANI KRACK MOVIE BHOOM BHADDHAL LYRICAL VIDEO SONG RELEASED PK

Krack Bhoom Bhaddhal song: భూమి బద్ధలయ్యే ఐటం సాంగ్‌తో వచ్చిన రవితేజ..

రవితేజ క్రాక్ లిరికల్ సాంగ్ (ravi teja krack)

రవితేజ క్రాక్ లిరికల్ సాంగ్ (ravi teja krack)

Krack Bhoom Bhaddhal song: ఐటం సాంగ్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయాయి. ప్రతీ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ ఉండేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు క్రాక్ సినిమాలో కూడా రవితేజ ఇలాంటి అదిరిపోయే పెప్పీ నెంబర్‌తో వచ్చాడు.

ఐటం సాంగ్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయాయి. ప్రతీ సినిమాలోనూ స్పెషల్ సాంగ్ ఉండేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు క్రాక్ సినిమాలో కూడా రవితేజ ఇలాంటి అదిరిపోయే పెప్పీ నెంబర్‌తో వచ్చాడు. తమన్ సాయంతో భూమి బద్ధలయ్యేలా కిరాక్ మాస్ సాంగ్‌లో చిందేసాడు.. చిందులు చించేసాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. డాన్ శీను, బలుపు లాంటి విజయాల తర్వాత గోపీచంద్‌తో మాస్ రాజా చేస్తున్న మూడో సినిమా ఇది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. లాక్‌డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టిన గోపీచంద్ మలినేని.. వీలైనంత త్వరగా క్రాక్ షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ మధ్యే రవితేజ, అప్సర రాణిపై అదిరిపోయే మాస్ నెంబర్ షూట్ చేసాడు గోపీచంద్. రామ్ గోపాల్ వర్మ థ్రిల్లర్ సినిమా హీరోయిన్ అప్సర రాణిని ఈ చిత్రంలో ఐటం సాంగ్ కోసం తీసుకున్నాడు దర్శకుడు గోపీచంద్. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ మాస్ నెంబర్‌కు తనదైన శైలిలో బీట్ ఇచ్చాడు తమన్.

అంతే జోరుగా మంగ్లీ, శ్రీ కృష్ణ, సింహా పాడారు. ఇక రవితేజ, అప్సర డాన్సులు అదుర్స్ అనిపించాయి. ముఖ్యంగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ పాట రేంజ్ పెంచేసింది. భూమ్ బద్ధల్.. భూమ్ బద్ధల్.. నా ముద్దుల సౌండ్‌కు అంటూ సాగిపోయే ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. వరస ఫ్లాపులతో డీలా పడిపోయిన రవితేజ కెరీర్‌కు క్రాక్ కీలకంగా మారింది. తమిళనాట విజయం సాధించిన సేతుపతి సినిమా ఆధారంగా క్రాక్ తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుంది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Apsara Rani, Ravi Teja, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు