రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రాబోతున్న సినిమాకి ‘క్రాక్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది చిత్రబృందం. అంతేకాదు ఈ సినిమా ఈరోజు అధికారికంగా ప్రారంభం అయ్యింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుతన్న ఈ సినిమాని వచ్చే సంవత్సరం సమ్మర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. క్రాక్‌లో రవితేజ సరసన అందాల తార శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్‌లు నటించనున్నారు. తమిళ నటుడు సముద్రఖని మరో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టనున్నాడు. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ ‘డిస్కోరాజా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జంటగా పాయల్‌రాజ్‌పుత్, నభా నటేష్ నటిస్తున్నారు. వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Mass Maharaj @RaviTeja_offl's #Krack Muhurtham and Launch
🎬Clap by #AlluAravind
🎥Camera switch on Paruchuri Venkateswara Rao
📜script @DirSurender & #DilRaju
First shot direction by @Ragavendraraoba @megopichand @shrutihaasan @varusarath @thondankani @TagoreMadhu pic.twitter.com/yqvht6znjW
— BARaju (@baraju_SuperHit) November 14, 2019
అందాలతో కేక పుట్టిస్తున్న కియారా..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Raviteja, Telugu Cinema News