రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజకు జంటగా శ్రుతిహాసన్ నటిస్తోంది. రవితేజ ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఏపీలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ సెంట్రల్ జైలుకి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తోంది చిత్రృందం. క్రాక్ సంబందించి ఇదే లాస్ట్ షెడ్యూల్. దీంతో ఏప్రిల్ 2 వరకు అక్కడే షూటింగ్ జరగనుంది. దీంతో టాకీ పూర్తవుతుంది. ఏప్రిల్ 4నుండి జర్మనీలో పలు అందమైన ప్రదేశాల్లో రెండు పాటల్నీ చిత్రీకరించడానికి వెళ్లనుంది చిత్రబృందం. ఆ తర్వాత హైదరాబాద్ సారధి స్టూడియోలో వేసిన భారీ సెట్లో మరో మాస్ పాటను చిత్రీకరించనున్నారు.
ఇక అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సమ్మర్ స్పెషల్‌గా మే 8న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రవితేజ, శృతి హాసన్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని మరో తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. క్రాక్‌ను సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై బి. మధు నిర్మిస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ravi Teja