news18-telugu
Updated: December 2, 2020, 6:41 PM IST
రవితేజ Photo : Twitter
Ravi Teja: రాజా ది గ్రేట్ తర్వాత సరైన సక్సెస్ లేని మాస్ మహారాజ్ రవితేజ.. ఇపుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో వరస ఫ్లాపులు వస్తున్నా కూడా రవితేజ జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ వరస సినిమాలతో సత్తా చూపిస్తున్నాడు. అంతకు ముందు యేడాది "టచ్ చేసి చూడు".. "నేలటికెట్".. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాలతో వచ్చాడు మాస్ రాజా. "రాజా ది గ్రేట్"తో రెండేళ్ల తర్వాత వచ్చి హిట్ కొట్టిన ఈ హీరో.. ఆ తర్వాత మాత్రం అదే టెంపో కొనసాగించలేకపోయాడు. ఈయన సినిమాలు కనీసం రూ. 10 కోట్ల మార్క్ అందుకోలేక చేతులెత్తేస్తున్నాయి. ఈ యేడాది మాత్రం ‘డిస్కో రాజా’ సినిమాతో పలకరించాడు. కానీ ఈ సినిమా మాస్ రాజాకు హిట్టు ఇవ్వలేకపోయింది.
ప్రస్తుతం రవితేజ.. గోపిచంద్ మలినేనితో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. క్రాక్ సినిమాతో పాటు రవితేజ. బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘రాక్షసుడు’ రీమేక్ తెరకెక్కించిన రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తున్నాడు. మాస్ మహరాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా ఖిలాడి. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంటుందని.. అందులో అందాల తార ప్రణీత నర్తిస్తుందని సమాచారం. ఈ సినిమాలో విలన్‌గా తమిళం, తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో హీరోగా సత్తా చూపెట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ ఇందులో ప్రతినాయకుడిగా నటించబోతున్నట్టు సమాచారం.

మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో విలన్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ (Twitter/Photo)
ఈ చిత్రంలో హీరో పాత్రతో సమానంగా విలన్ పాత్రను డిజైన్ చేసారు. ఈ చిత్రం కూడా తమిళంలో హిట్టైన ఓ సినిమాకు రీమేక్ అని చెబుతన్నారు. ఇప్పటికే అర్జున్.. ‘కడలి’, ‘అభిమన్యుడు’ వంటి చిత్రాల్లో స్టైలిష్ విలన్ పాత్రలో అదరగొట్టాడు. ఇపుడు రవితేజ హీరోగా నటిస్తోన్న చిత్రంలో హీరోతో సమానమైన పాత్ర కావడంతో అర్జున్ ఈ సినిమాకు ఓకే చేసినట్టు సమాచారం. త్వరలో ఈ సినిమాలో అర్జున్ నటించే విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
December 2, 2020, 6:41 PM IST