హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja 71: తొలిసారి అలాంటి ప్రాజెక్ట్‌లో రవితేజ.. 71వ సినిమా కోసం మాస్ మహారాజ్ నయా ప్లాన్..

Ravi Teja 71: తొలిసారి అలాంటి ప్రాజెక్ట్‌లో రవితేజ.. 71వ సినిమా కోసం మాస్ మహారాజ్ నయా ప్లాన్..

రవితేజ (File/Photo)

రవితేజ (File/Photo)

Ravi Teja 71: తొలిసారి అలాంటి ప్రాజెక్ట్‌లో రవితేజ.. 71వ సినిమా కోసం మాస్ మహారాజ్ నయా ప్లాన్.. మాస్ మహారాజ్ నయా ప్లాన్. తాజాగా తన 71వ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తున్నారు.

Ravi Teja 71: మాస్ మహారాజ్ రవితేజ 2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా ఈ యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాతాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. దాదాపు ఈ సినిమా రూ. 40 కోట్ల షేర్ సాధించింది.  అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కొత్త ఊపిరిని ఇచ్చింది. మరోవైపు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అంతేకాకుండా వాటిని ఏకకాలంలో కూడా ఫినిష్ చేస్తున్నారు. క్రాక్ తర్వాత ఏకంగా మూడు సినిమాలు ఆల్రెడీ అనౌన్స్ చేసిన రవితేజ.. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. అందులో ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు సమాచారం.

రవితేజ నటించిన ఖిలాడి మూవీ టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. మరోవైపు యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.

Chiranjeevi -Pawan Kalyan - Ram Charan: ఒకే రూట్లో మెగా హీరోలు.. ఆ తరహా పాత్రల్లో అదరగొట్టనున్న చిరంజీవి,పవన్, రామ్ చరణ్..


ఇక మూడో సినిమా షూట్ కూడా ఇటీవల స్టార్ట్ చేసేసారు. రీసెంట్‌గా రవితేజ కెరీర్‌లో 70వ సినిమాని ప్రకటించారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మతో తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు.

Mahesh - Namrata : మహేష్ బాబు, నమ్రత, అభిషేక్, ఐశ్వర్య సహా తమ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్లను పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు..


ఇక ‘ఖిలాడి’  సినిమా సెట్స్ పై ఉండగానే రవితేజ.. శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఆన్ డ్యూటీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో రవితేజ సరసన .. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

Nagarjuna : ప్రపంచ సినీ చరిత్రలో ఆ రికార్డు ఒక్క నాగార్జునకు మాత్రమే సాధ్యమైంది..

ఈ సినిమాలతో పాటు రవితేజ మరో సినిమాను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ జరగుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్  చేసుకుంది. తాజాగా  ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. హీరోగా రవితేజ కెరీర్‌లో ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పాలి.

First published:

Tags: Ravi Teja, Ravi Teja 71, Sudheer Varma, Tollywood

ఉత్తమ కథలు