Home /News /movies /

RAVI TEJA 70 MOVIE RAVANASURA LAUNCH CHIRANJEEVI TO GRACE THE EVENT HERE ARE THE DETAILS SR

Raviteja | Chiranjeevi : రవితేజ కోసం వస్తోన్న చిరంజీవి.. ముహూర్తం ఫిక్స్..

Raviteja and Chiranjeevi Photo : Twitter

Raviteja and Chiranjeevi Photo : Twitter

Raviteja | రవితేజ కెరీర్‌లో 70వ సినిమాని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మతో తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రానికి రావ‌ణాసుర టైటిల్‌ను ఫైన‌ల్ చేశారు.

ఇంకా చదవండి ...
    Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ 2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా పోయిన యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కొత్త ఊపిరిని ఇచ్చింది. మరోవైపు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అంతేకాకుండా వాటిని ఏకకాలంలో కూడా ఫినిష్ చేస్తున్నారు. క్రాక్ తర్వాత ఏకంగా మూడు సినిమాలు ఆల్రెడీ అనౌన్స్ చేసిన రవితేజ.. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇక మూడో సినిమా షూట్ కూడా ఇటీవల స్టార్ట్ చేసేసారు. అది అలా ఉంటే రవితేజ కెరీర్‌లో 70వ సినిమాని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రానికి రావ‌ణాసుర టైటిల్‌ను ఫైన‌ల్ చేశారు. ఈ సినిమాలో ర‌వితేజ లుక్ ఇప్ప‌టికే విడుద‌ల‌వ‌్వగా తాజాగా అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా లాంఛింగ్‌కు చిరంజీవి రానున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన విడుదలైంది.

    ఈ సినిమా లాంఛ్ ఈవెంట్‌ను జ‌న‌వ‌రి 14న సంక్రాంతి సంద‌ర్భంగా ఉద‌యం 9.50 గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో జరుపనున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో ర‌వితేజ లాయ‌ర్‌గా న‌టించ‌నున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఆయన ఇటీవల ఓ ప్యాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావుగా వస్తోన్న సినిమాకు వంశీ దర్శకత్వం వహించనున్నారు.


    ఇక రవితేజ చేస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. మరోవైపు యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.

    Kondapolam : కొండపొలంకు రికార్డ్ స్థాయిలో TRP రేటింగ్.. షాక్‌లో ట్రేడ్ పండితులు..

    ఇక ‘ఖిలాడి’  సినిమా సెట్స్ పై ఉండగానే రవితేజ.. శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఆన్ డ్యూటీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో రవితేజ సరసన .. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

    ఈ సినిమాలతో పాటు రవితేజ మరో సినిమాను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Chiranjeevi, Raviteja, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు