పటాస్ షో ఇక చేయనంటున్న శ్రీముఖి...యాంకర్ రవితో గొడవే కారణమా..?

ప్రస్తుతం పటాస్ షో నుంచి శ్రీముఖి దూరం అవుతుందనే వార్తలకు ఆమె కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో రవితో ఉన్న గొడవలే కారణమనే పాయింట్ కు బలం చేకూరుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: November 9, 2019, 10:41 PM IST
పటాస్ షో ఇక చేయనంటున్న శ్రీముఖి...యాంకర్ రవితో గొడవే కారణమా..?
రవి, శ్రీముఖి (Facebook)
  • Share this:
పటాస్ షో అనగానే గుర్తొచ్చేది శ్రీముఖి, యాంకర్ రవి చేసే రచ్చరచ్చే అనేది అందరూ అనే మాటే..అయితే బిగ్ బాస్ లో ప్రవేశించే వరకూ శ్రీముఖికి బుల్లితెరపై పేరు తెచ్చిన షో అంటూ ఏదైనా ఉందంటే అది పటాస్ అనే చెప్పాలి. యూత్ ను ఎంటర్‌టైన్ చేస్తూ సాగిన ఈ షోలో శ్రీముఖి చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే రవి, శ్రీముఖి ఇద్దరూ కలిస్తేనే పటాస్ అన్నంత రేంజ్ లో ఇద్దరి కెమిస్ట్రీ ఉండేది. అలాంటిది బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీముఖి ఎంటర్ కాగానే ఒక్కసారిగా పటాస్ షోలో యాంకర్ గా వర్షిణి ఎంటర్ అయ్యింది. అయితే రవి ఎనర్జీతో పోల్చితే వర్షిణి ఎనర్జీ దాదాపు నిల్ అనే చెప్పాలి. ఇద్దరి కెమిస్ట్రీ కూడా అంతగా పండలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో పూర్తి అయ్యాక తాజాగా శ్రీముఖి మాల్దీవ్స్ నుంచి పెట్టిన వీడియో లైవ్ లో తానిక పటాస్ షో చేస్తానో లేదో అంటూ క్లారిటీ లేకుండా మాట్లాడింది. దీంతో ఇక శ్రీముఖి పటాస్ లో కనపడే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని శ్రీముఖి పరోక్షంగా చెప్పేసింది. అయితే బిగ్ బాస్ లో యాంకర్ రవి స్పెషల్ గెస్ట్ గా వచ్చి అలీరెజాను కలిశాడు. ఆ సమయంలో శ్రీముఖి ఉన్నప్పటికీ తనతో పాటు పటాస్‌లో చాలా ఏళ్లు కలిసి చేసిన రవిని కనీసం పలకరించలేదు. రవియే కల్పించుకొని శ్రీముఖికి హాయ్ చెప్పాడు. అప్పుడే వీరిద్దరి మధ్య ఏదో కోల్డ్ వార్ జరుగుతుందనే వార్తలు బయటకు వచ్చాయి.

ప్రస్తుతం పటాస్ షో నుంచి శ్రీముఖి దూరం అవుతుందనే వార్తలకు ఆమె కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో రవితో ఉన్న గొడవలే కారణమనే పాయింట్ కు బలం చేకూరుతోందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే త్వరలోనే హైదరాబాద్ చేరుకొని తన నెక్ట్స్ ప్లాన్స్ చెబుతానని చెప్పేసింది. దీంతో శ్రీముఖి తర్వాతి స్టెప్ ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
Published by: Krishna Adithya
First published: November 9, 2019, 10:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading