రవిబాబు ‘ఆవిరి’ సినిమా ట్రైలర్.. ఓ చిన్నపాప ‘ఆత్మ’కథ..

రీసెంట్‌గా ‘అదుగో’ అంటూ పంది పిల్లతో ఒక ప్రయోగాత్మక చిత్రం చేసిన రవిబాబు.. తాజాగా ‘ఆవిరి’ అనే హార్రర్ నేపథ్య చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 10, 2019, 5:22 PM IST
రవిబాబు ‘ఆవిరి’ సినిమా ట్రైలర్.. ఓ చిన్నపాప ‘ఆత్మ’కథ..
రవిబాబు ‘ఆవిరి’ మూవీ ఫస్ట్ లుక్ (Twitter/Photo)
  • Share this:
రీసెంట్‌గా ‘అదుగో’ అంటూ పంది పిల్లతో ఒక ప్రయోగాత్మక చిత్రం చేసిన రవిబాబు.. తాజాగా ‘ఆవిరి’ అనే హార్రర్ నేపథ్య చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ఈ ట్రైలర్‌లో రాజ్ కుమార్ రావ్ అండ్ ఫ్యామిలీ ఒక ఇంట్లో ఉంటారు. వాళ్ల పాప ఓ సమస్యతో బాధ పడుతుంటుంది. అలాంటి ఇంట్లోనే వీళ్లతో పాటు ఆ ఇంట్లో ఒక ఆత్మ ఉంటుంది. అప్పుడే పాప ఇంట్లోంచి పారిపోతుంది. ఆత్మ ఆ పాపను బయటికి తీసుకెళ్లిపోతుంది. అప్పుడు ఆ తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసారనేది ఈ సినిమా ట్రైలర్‌లో చూపెట్టారు.

‘అవును’ తర్వాత రవిబాబు మరోసారి హార్రర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఆవిరికి, ఇంట్లో ఉన్న ఆత్మకు ఉన్న సంబంధం ఏమిటో తెలియాలంటే నవంబర్ 1 వరకు ఆగాల్సిందే. ‘ఆవిరి’ సినిమాను రవిబాబు డైరెక్ట్ చేయడమే కాకుండా తాను కూడా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఇతర పాత్రల్లో నేహా చౌహాన్, శ్రీముక్త, భరణి శంకర్, ముఖ్తార్ ఖాన్ నటించారు. ఈ సినిమాను ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు నిర్మించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.

First published: October 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు