news18-telugu
Updated: June 16, 2020, 1:42 PM IST
సుశాంత్ మరణంపై బాలీవుడ్ ప్రముఖులు (Twitter/Photos)
ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్... హఠాత్తుగా తనువు చాలించడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈయన మరణానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న రాజకీయాలే కారణం అని కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఆయనది ఆత్మహత్యా కాదు. .హత్య చేసారంటూ చెప్పుకొచ్చింది. తాజాగా రవీనా టాండన్ కూడా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై స్పందించింది. రవీనా విషయానికొస్తే.. ఒకప్పుడు తన గ్లామర్‌తో పాటు నటనతో ఒక తరం ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రవీనా టాండన్..ఈ సందర్భంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో దాగి ఉన్న చీకటి కోణాలను ట్విట్టర్ వేదికగా బయటపెట్టింది. ఇండస్ట్రీలో కుళ్లు రాజకీయాలు, గ్రూపు పాలిటిక్స్ ఎపుడు నడుస్తుంటాయని ఆరోపించింది. ఈ సందర్భంగా కొన్ని సినిమాల్లో హీరోలు, వాళ్లు గర్ల్ ఫ్రెండ్స్ కారణంగా తనను కొన్ని సినిమాల్లోంచి తప్పించిన ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఇండస్ట్రీలో పైకొస్తోన్న వాళ్లను అణగదొక్కే ప్రయత్నాలు బాలీవుడ్‌లో ఎపుడు జరుగుతూ ఉంటాయన్నారు. ఇక్కడ చెడ్డవాళ్లే కాదు.. అక్కడక్కడ మంచి వాళ్లు కూడా ఉంటారని చెప్పుకొచ్చింది.
మరోవైపు ప్రముఖ హీరో వివేక్ ఓబరాయ్ మాట్లాడుతూ.. నేను నీ అంత్యక్రియల్లో పాల్గొనడం అత్యంత బాధాకరమన్నాడు. నీ వ్యక్తిగత బాధలను నాతో పంచుకొని ఉంటే అతని బాధ తగ్గించడానికి నేను నా శాయశక్తుల ప్రయత్నించే వాడినంటూ ట్విట్టర్‌లో ఓపెన్ లెటర్ రాసాడు. ఆత్మహత్య చేసుకోవడం సమస్యలన్నింటికీ పరిష్కారం కాదన్నారు. సుశాంత్ ఒక్కసారి తన ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు అభిమానుల గురించి ఆలోచించినట్టైతే బాగుండేదన్నారు. ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం అంటారు. అదంతా ట్రాష్ అన్నారు. వీళ్లు ఇతరులకు చెడు చేసేకంటే మంచి చేసేందుకు ప్రయత్నిస్తే బాగుంటున్నారు. ప్రతిభ ఉన్నావారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఇండస్ట్రీలో ఎంతైనా ఉందన్నారు.
మరోవైపు ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ మాట్లాడుతూ..సుశాంత్ ఆత్మహత్య చేసుకునేలా చేసిన వారి కథలు తనకు తెలుసన్నారు. ఇక సుశాంత్‌తో శేఖర్ కపూర్ యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ‘పానీ’ సినిమాలుకున్నారు. ఎందుకో ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు. తాజాగా ఆయన సుశాంత్ మరణంపై ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు చాలా మంది సినీ ప్రముఖులు సుశాంత్ మృతిపై స్పందించారు.
మొత్తంగా బాలీవుడ్‌లో ఉన్న కుళ్లు రాజకీయాల కారణంగానే ఆయన తనువు చాలించనట్టు వీళ్లు ట్వీట్ ద్వారా స్పష్టమవుతోంది.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
June 16, 2020, 1:42 PM IST