హోమ్ /వార్తలు /సినిమా /

పవన్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి న్యూస్... పీకే సినిమాలో కేజీఎఫ్ స్టార్...

పవన్ ఫ్యాన్స్‌కు పండుగ లాంటి న్యూస్... పీకే సినిమాలో కేజీఎఫ్ స్టార్...

పవన్ కళ్యాణ్ సినిమాలో కేజీఎఫ్ స్టార్

పవన్ కళ్యాణ్ సినిమాలో కేజీఎఫ్ స్టార్

కేజీఎఫ్‌2 సినిమాతో రవీనా రీఎంట్రీ అదిరింది.రవీనా నటనకు మరోసారి ప్రేక్షకులు సలాం కొట్టారు. దీంతో ఈ సీనియర్ హీరోయిన్ పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

టిప్ టిప్ బర్‌‌సా పాని అంటూ.. కుర్రాల గుండెల్లో వేడి పుట్టించిన హీరోయిన్ రవీనా టండన్. ఒకప్పుడు రవీనా అంటే ఆ క్రేజ్ మాములుగా ఉండేది కాదు. తెలుగులో కూడా రవీనా పలు సినిమాల్లో నటించిన అవి పెద్దగా ఆమెకు మంచి పేరు తీసుకురాలేకపోయాయి. రవీనా బంగారు బుల్లోడు, రథసారధి వంటి సినిమాలలో నటించింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు అంతంత మాత్రమే గుర్తింపు పొందింది. ఇక ఆ తర్వాత ఈమె తెలుగులో ఎటువంటి సినిమాను కూడా చేయలేదు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత కే జి ఎఫ్-2 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది రవీనా టండన్.

కేజీఎఫ్2 సినిమాతో రవీనా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇంత వయసులో కూడా ఆమె ఫిట్ నెస్‌గా ఉండటంపై అంతా చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఆమె ప్లేస్‌లో కూడా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని సినీ అభిమానులు జోరుగా చర్చించుకుంటున్నారు. కేజీఎఫ్‌లో రవీనా టండన్ ప్రధానమంత్రి రిమికా సేన్ పాత్రలో నటించి సినిమాకి హైలెట్ అయ్యేలా నటించింది. అయితే ఈ పాత్ర ఇందిరా గాంధీ పాత్ర కావచ్చని నెటిజెన్స్ భావిస్తున్నారు. ఇంత పవర్ఫుల్ పాత్ర, ఒక వైపు అరాచకం ,మరొకవైపు అవినీతి, ఈ రెండిటిని ఫేస్ చేసే ధైర్యం.. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం అనే పాత్రల రవీనా టాండన్ విశ్వరూపాన్ని చూపించిందని చెప్పవచ్చు. దీంతో ఈమె పాత్ర కి న్యాయం చేయడంతో రవీనాకు పలు సినిమా అవకాశాలు వస్తున్నాయి. తాజాగా పవన్ సినిమాలో పవన్ నటించబోతోందని వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌లో ‘భవదీయుడు భగత్ సింగ్‌’ ఒక‌టి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై హ‌రీష్ శంక‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సినిమా గురించి ప‌వ‌ర్ స్టార్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు

ఇటీవలే హరీష్ శంక‌ర్ మాట్లాడుతూ ‘భవదీయుడు భగత్ సింగ్‌’లో హీరోయిన్ ఎవ‌ర‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేయ‌డంతో పాటు కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ న‌టుడు న‌టించ‌బోతున్నారంటూ తెలియ‌జేశారు. ‘భవదీయుడు భగత్ సింగ్‌’లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌నుంది. బాలీవుడ్‌లో విల‌క్ష‌ణ పాత్ర‌లు చేసే యాక్ట‌ర్ పంక‌జ్ త్రిపాఠి కూడా ఇందులో న‌టించ‌బోతున్నార‌ని తెలిసింది. ఇప్పుడు రవీనా టండన్ కూడా ఇందులో చేరనుందని సమాచారం

పవన్ నటిస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో ఈమేను ఎంచుకోపోతున్నారనే వార్త ఇప్పుడు ఎక్కువగా చక్కర్లు కొడుతోంది. రవీనా టండన్ ఈ పాత్రకు సరైన జోడీగా గా పవన్ ,హరి శంకర్ భావించినట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు ఈ చిత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత హరీష్ శంకర్ తో తన తదుపరి చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

First published:

Tags: Harish Shankar, Pawan kalyan, Raveena Tandon

ఉత్తమ కథలు