Rashmika Mandanna: రష్మిక అత్యుత్సాహం...హీరో కార్తి ఆగ్రహం

Rashmika Mandanna | తమిళంలో కార్తి సరసన నటిస్తున్న సినిమా టైటిల్‌ను సినీ నటి రష్మిక అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో వెల్లడించింది. దీని పట్ల చిత్ర యూనిట్ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 20, 2019, 9:56 AM IST
Rashmika Mandanna: రష్మిక అత్యుత్సాహం...హీరో కార్తి ఆగ్రహం
రష్మిక (Photo : Twitter.com/iamRashmika)
news18-telugu
Updated: August 20, 2019, 9:56 AM IST
తెలుగు, కన్నడలో వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న నటి రష్మిక మందన. ‘గీత గోవిందం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. ఇటీవల ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కన్నడలోనూ వరుస సినిమాలలో నటిస్తోంది. త్వరలో తమిళ్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది రష్మిక.  కార్తికి జోడీగా ఓ చిత్రంలో నటిస్తోంది. మరికొన్ని సినిమాల్లోనూ నటించేందుకు ఒప్పందాలు జరిగినట్లు సమాచారం.

కార్తి-రష్మిక జంటగా భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మాణంలో ఆ చిత్రాన్ని తెరకకెక్కిస్తున్నారు. నెపోలియన్‌, యోగిబాబు, సతీష్‌, మలయాళ నటుడు లాల్‌ తదితరులు ప్రధాన తారాగణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను త్వరలోనే ఓ భారీ కార్యక్రమంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ప్రేక్షకుల మధ్య హైప్ క్రియేట్ చేసేందుకు సినిమా టైటిల్‌ను సస్పెన్స్‌గా ఉంచాలని భావించారు.






 

Loading...


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి




 

💛


Rashmika Mandanna (@rashmika_mandanna) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది






ఈ నేపథ్యంలో రష్మిక అత్యుత్సాహంతో పొరబాటున పెద్ద తప్పే చేసింది. చిత్ర యూనిట్ అనుమతి లేకుండా ఆ సినిమా పేరును వెల్లడించేసింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సుల్తాన్‌’ సినిమా చిత్రీకరణలో నాలుగోరోజు’ అంటూ ఓ ఫొటోను కూడా పోస్ట్‌ చేసింది. అనుమతి లేకుండా సినిమా పేరును ప్రకటించడం పట్ల రష్మికపై హీరో కార్తితో పాటు ‘సుల్తాన్’ చిత్ర యూనిట్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.



 




Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి




 

🖤 . . .📷: @trishasarang 🦄: @simua_996 👗: @shravyavarma


Rashmika Mandanna (@rashmika_mandanna) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది






Don't Miss: రష్మిక గ్యాలరీ
First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...