రష్మికపై అసభ్యకర కామెంట్‌.. దీటుగా బదులిచ్చిన బ్యూటీ..

సోషల్ మీడియాలో కొందరు ఆకతాయులు సినీ తారలను ట్రోల్ చేస్తూ ఉంటారు. సెలబ్రిటీ నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు, నచ్చకపోతే అసహ్యమైన కామెంట్లు పెడతూ వారిని బాధపెడుతుంటారు.

news18-telugu
Updated: November 8, 2019, 4:40 PM IST
రష్మికపై అసభ్యకర కామెంట్‌.. దీటుగా బదులిచ్చిన బ్యూటీ..
రష్మిక మందన్న (Instagram/rashmika_mandanna)
  • Share this:
సోషల్ మీడియాలో కొందరు ఆకతాయులు సినీ తారలను ట్రోల్ చేస్తూ ఉంటారు. సెలబ్రిటీ నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు, నచ్చకపోతే అసహ్యమైన కామెంట్లు పెడతూ వారిని బాధపెడుతుంటారు. తాజాగా యువ హీరోయిన్ రష్మిక మందనకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల రష్మిక తన చిన్ననాటి ఫొటోను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఈ ఫోటోపై రకరకాల ట్రోల్స్ రావడం మొదలైంది. ఓ నెటిజన్ రష్మిక చిన్నప్పటి ఫొటోలను పోస్ట్ చేస్తూ వాటిపై ‘ఇంత చిన్న పిల్ల పెద్దై ఇంటర్నేషనల్ హైవే అవుతుందని ఎవరు మాత్రం ఊహించారు’ అంటూ కొన్ని అసభ్యకరమైన కామెంట్లు పెట్టాడు. అది చూసిన రష్మిక ఇన్‌స్టా వేదికగా తన గురించి ట్రోల్స్‌ చేస్తున్న వారందరినీ ఉద్దేశిస్తూ కౌంటర్‌గా ఓ పోస్ట్‌ పెట్టారు.
View this post on Instagram

Let’s spice up things a little- Who’s the celebrity who want to take on a date with 😍 and pay for?🤪😂


A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

‘నటీనటులను ట్రోల్‌ చేయడం ద్వారా నెటిజన్లకు ఏమోస్తుందో నాకు తెలియడం లేదు. మేము ఏమీ అనమనే కదా మమ్మల్ని మీరు టార్గెట్‌ చేస్తున్నారు. సెలబ్రిటీలమైనంత మాత్రాన మా గురించి ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడడం సరికాదు. నెటిజన్లలో చాలామంది చెబుతుంటారు అసభ్యకరమైన ట్రోల్స్‌ గురించి పట్టించుకోవద్దని.. నిజమే మీరు మా పని గురించి ట్రోల్‌ చేయండి. కానీ మా వ్యక్తిగత విషయాలు, కుటుంబం గురించి ట్రోల్‌ చేసే హక్కు మీకు లేదు. ఏ నటీనటులపై ఇలాంటి ట్రోల్స్‌ రాకూడదు. నటీనటులు కావడం అంత సులభం కాదు. ప్రతి వృత్తిలో గౌరవం ఉంటుంది. ప్రతి ఒక్కరూ గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోండి’’. అంటూ ట్రోల్స్ చేసే వారిపై మండిపడ్డారు. రష్మిక ప్రస్తుతం మహేష్ సరసన ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్‌‌తో ‘భీష్మ’ సినిమాల్లో నటిస్తోంది.

Instagram/rashmika_mandanna/


తెల్లని చీరలో రష్మీ అందాలు అదరహో..

Published by: Suresh Rachamalla
First published: November 8, 2019, 4:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading