సమంత సైడ్‌కు.. లైన్లోకి రష్మిక మందన..

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే..

news18-telugu
Updated: July 4, 2020, 3:47 PM IST
సమంత సైడ్‌కు.. లైన్లోకి రష్మిక మందన..
సమంత, రష్మిక మందన Photo : Twitter
  • Share this:
Naga Chaitanya : నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే  చాలా వరకు లవ్ స్టోరీ షూటింగ్ జరపుకుంది. కారోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే ఈ మధ్య కాలంలో నాగ చైతన్య కథల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నాడు. 'మజిలీ' తరువాత ఆయన కొత్తదనం గల కథలను మాత్రమే ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. 'లవ్ స్టోరీ' తర్వాత మరో రెండు సినిమాలకు ప్లాన్ చేశాడు చైతూ.. అందులో భాగంగా ఆయన 'బంగార్రాజు' 'నాగేశ్వరరావ్' సినిమాల్లో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చైతన్య. 'దిల్' రాజు నిర్మించనున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. విక్రమ్ కుమార్ ఇటీవల నానితో 'గ్యాంగ్ లీడర్' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అంతేకాదు గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ 'మనం' సినిమా చేశాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విక్రమ్ దర్శకత్వంలో చైతన్య సోదరుడు అఖిల్ 'హలో' చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది.

ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో వచ్చే ఈ తాజా చిత్రానికి 'థ్యాంక్యూ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో హీరోయిన్‌గా సమంత నటిస్తుందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో నిజ జీవిత జంట మరోసారి వెండితెరపై కనువిందు చేయనుందని అభిమానులు కూడా సంబరపడ్డారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో సమంత కాదు.. రష్మిక మందన నటిస్తోందని మరో వార్త హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం రష్మిక మంచి ఫామ్ లో ఉండడంతో ఆమె ఈ సినిమాలో నటించడం అంతో ఇంతో సినిమాకు ప్లస్ కానుందని చిత్రబృదం భావిస్తోందట. ఇక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ జానర్‌లో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: July 4, 2020, 3:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading