Rashmika Mandanna : కోలీవుడ్‌లో రష్మిక మందన్న దూకుడు .. మరో క్రేజీ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన భామ..

రష్మిక మందన్న (Rashmika Mandanna)

Rashmika Mandanna : కోలీవుడ్‌లో రష్మిక మందన్న దూకుడు .. మరో క్రేజీ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన భామ.. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Rashmika Mandanna : కోలీవుడ్‌లో రష్మిక మందన్న దూకుడు .. మరో క్రేజీ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన భామ.. వివరాల్లోకి వెళితే.. శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళంతో పాటు హిందీలో దుమ్ము దులుపుతోంది. అంతేకాదు అన్ని భాషల వాళ్లకు రష్మిక ఫస్ట్ ఛాయిస్‌గా మారింది. రీసెంట్‌గా కార్తి హీరోగా నటించిన ‘సుల్తాన్’ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టు.. ఇపుడు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే రష్మిక మందన్న.. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాతో పలకరించబోతుంది. ఆ సినిమా విడుదల కాకుండానే రష్మిక మందన్న బాలీవుడ్‌లో టాప్ టక్కర్ అనే పాప్ ఆల్బమ్‌తో పలకరించింది. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటు అమితాబ్ బచ్చన్‌‌తో కలిసి ‘గుడ్ బై’ సినిమాలో నటిస్తోంది.

    వరుసగా బాలీవుడ్ అవకాశాలు రావడంతో రష్మిక మందన్న.. బాంద్రాలో పూజా హెగ్డే కొత్తగా తీసుకున్న ఫ్లాట్‌కు దగ్గరలో సెలబ్రిటీలు ఉండే ప్రదేశంలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం.. త్వరలోనే అందులోకి గృహ ప్రవేశం చేయనున్నట్టు సమాచారం. మరోవైపు హైదరాబాద్‌లో కూడా రష్మిక ఉండటానికి ఓ ఇల్లు చూసిందట.

    Rashmika Mandanna Top Tucker Song: రష్మిక మందన్న ’టాప్ టక్కర్’ సాంగ్ విడుదల.. కెవ్వు కేక పుట్టిస్తోన్న శాండిల్ వుడ్ బ్యూటీ..,Sandalwood Beauty Rashmika Mandanna Top Tucker song Released,Rashmika Mandanna,Rashmika Mandanna Top Tucker Song Released,Rashmika Mandanna Top Tucker Teaser,Rashmika Mandanna Top Tucker Teaser Released,Top Tucker Teaser,Rashmika Mandanna Twitter,Rashmika Mandanna bollywood Movie,Rashmika Mandanna instagram,Rashmika Mandanna Movies,Rashmika Mandanna age,Rashmika Mandanna Reality show,Rashmika Mandanna news, Rashmika house in hyderabad,rashmika mandanna dance,rashmika mandanna cars,rashmika mandanna,rashmika,rashmika mandanna hot,rashmika mandanna songs,rashmika mandanna kiss,rashmika hot,rashmika mandanna photos,rashmika mandanna movies,rashmika mandanna lifestyle,rashmika madanna,rashmika mandanna hot photo shoot,rashmika mandanna whatsapp status,rashmika hot in chalo,rashmika mandanna hot kiss,rashmika mandanna hot navel,rashmika mandanna hot songs,rashmika mandanna hot dance,రష్మిక మందన్న,రష్మిక మందన్న హాట్,రష్మిక మందన్న హాట్ ఫోటోస్,Upasana Konidela, upasana kamineni konidela,ram charan,upasana facebook, ram charan twitter,upasana konidela kamineni,upsasana twitter,రష్మిక మందన్న,రష్మిక మందన్న సినిమాలు,రష్మిక మందన్న వయసు,రష్మిక మందన్న రియాలిటీ షో,రష్మిక మందన్న బాలీవుడ్ మూవీ,టాప్ టక్కర్ టీజర్ రిలీజ్,టాప్ టక్కర్ టీజర్ విడుదల,రష్మిక మందన్న టాప్ టక్కర్ సాంగ్ విడుదల
    రష్మిక మందన్న (టాప్ టక్కర్’(Instagram/Photo)


    తాజాగా ఈ భామ కోలీవుడ్‌లో శివకార్తికేయన్ సినిమాలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు సూర్య నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో కూడా ఈమెనే తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. రష్మిక విషయానికొస్తే.. తెలుగులో ఈమె వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా నటించిన 'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైంది రష్మిక మందన. ఆ తర్వాత విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఆ తర్వాత నాగార్జున, నానిల ’దేవదాసు’లో నటించింది. ఇక గతేడాది సంక్రాంతికి మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నితిన్‌తో చేసిన ‘భీష్మ’ సినిమా కూడా సూపర్ హిట్టైంది.  ప్రస్తుతం ఈమె చేతిలో అల్లు అర్జున్,.. ‘పుష్ప’ సినిమాతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఈమె తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ్‌లో పలు చిత్రాల్లో నటిస్తోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: