Rashmika Mandanna : ఆ హీరోయిన్ బయోపిక్‌లో నటించడం తన కోరిక అంటోంది శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna). ఈ కన్నడ బ్యూటీ విషయానికొస్తే.. తాజాగా ఈమె అభిమానులతో చిట్‌చాట్ చేస్తూ తనకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా కొంత మంది ఫ్యాన్స్ మీరు ఒకవేళ ఏదైనా బయోపిక్‌లో నటించాలనుకుంటే ఎవరి బయోపిక్‌లో నటిస్తారు అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది. తనకు సౌందర్య బయోపిక్ తెరకెక్కిస్తే అందులో తను నటిస్తాను అంటూ సమాధానమిచ్చింది. గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో సౌందర్య(Soundarya) బయోపిక్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఈమెకు తెలుగులో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకున్న మహానటి ఈమె. నిన్నటి తరం ప్రేక్షకులకు సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాల్లో మాత్రమే చూసారు.
కానీ నటన పరంగా చూసుకుంటే ఆ సావిత్రి అచ్చంగా ఇలాగే ఉండేదేమో అనేంతగా సౌందర్య అందర్నీ మాయ చేసారు. కానీ దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది ఈమె. స్వతహాగా కన్నడీగురాలైన సౌందర్య బయోపిక్‌లో మరో కన్నడ బ్యూటీ రష్మిక నటిస్తే బాగానే ఉంటుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..
ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి రాకముందు మా నాన్న నన్ను సౌందర్య గారిలా ఉంటావని తరుచూ చెబుతూ ఉండేవారు. ఇక సౌందర్య యాక్టింగ్, సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని రష్మిక పేర్కొన్నారు. రష్మిక మందన్న తెలుగుతో పాటు కన్నడ, తమిళంతో పాటు హిందీలో దుమ్ము దులుపుతోంది. అంతేకాదు అన్ని భాషల వాళ్లకు రష్మిక ఫస్ట్ ఛాయిస్‌గా మారింది.
ఈ యేడాది కార్తి హీరోగా నటించిన ‘సుల్తాన్’ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టు.. ఇపుడు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతోంది. ఇప్పటికే రష్మిక మందన్న.. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాతో పలకరించబోతుంది. ఆ సినిమా విడుదల కాకుండానే రష్మిక మందన్న బాలీవుడ్‌లో టాప్ టక్కర్ అనే పాప్ ఆల్బమ్‌తో పలకరించింది. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి ‘గుడ్ బై’ సినిమాలో నటిస్తోంది.
వరుసగా బాలీవుడ్ అవకాశాలు రావడంతో రష్మిక మందన్న.. బాంద్రాలో పూజా హెగ్డే కొత్తగా తీసుకున్న ఫ్లాట్‌కు దగ్గరలో సెలబ్రిటీలు ఉండే ప్రదేశంలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు చెప్పారు. అంతేకాదు అందులోకి గృహ ప్రవేశం కూడా చేసిందట. మరోవైపు హైదరాబాద్‌లో కూడా రష్మిక ఉండటానికి ఓ ఇల్లు చూసినట్టు సమాచారం. త్వరలో అక్కడ గృహ ప్రవేశం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో తెరకెక్కుతోన్న ‘పుష్ఫ’లో కథానాయికగా నటిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rashmika mandanna, Soundarya, Tollywood