ఇక్కడే ఇల్లు కొని.. ఉండిపోవాలని ఉంది : రష్మిక మందన

Rashmika Mandanna : రష్మిక మందన.. 'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన 'గీత గోవిందం'తో తెలుగువారికి మరింత దగ్గరైంది.

news18-telugu
Updated: February 23, 2020, 3:38 PM IST
ఇక్కడే ఇల్లు కొని.. ఉండిపోవాలని ఉంది : రష్మిక మందన
రష్మిక మందన Photo : Instagram/rashmika_mandanna
  • Share this:
Rashmika Mandanna : రష్మిక మందన.. 'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైన 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించిన రష్మిక సూపర్ హిట్ అందుకుంది. ఆమె తాజాగా నితిన్‌తో భీష్మలో నటించింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. వరుసగా హిట్ సినిమాలతో బీజిగా ఉన్న రష్మిక తాజాగా మీడియాతో మాట్లాడింది. తెలుగులో ఇంకో రెండు సినిమాల తరువాత హైదరాబాద్‌లోనే ఓ ఇల్లు కొనుక్కుంటానని, తనకు ఇక్కడే ఉండి పోవాలని అనిపిస్తోందని చెప్పింది. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాదానమిస్తూ తనకు కోపం వస్తే షాపింగ్ కు వెళ్తానని, సంప్రదాయ దుస్తులే తనకు  ఇష్టం అని చెప్పింది. తనను అందరూ తెలుగు అమ్మాయిననే అనుకుంటున్నారని, ఈ మధ్య తాను నటిస్తోన్న తెలుగు సినిమాల పాత్రలకు సొంతంగా తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నానని తెలిపింది. 

View this post on Instagram
 

The next Wonder Woman in the making⚡️⚡️⚡️


A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) on

ఇంకా రష్మిక మాట్లాడుతూ.. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు రాకుంటే, సినిమాలు చేయకుంటే ఫిట్‌నెస్‌కు సంబంధించిన బిజినెస్ చేస్తుండేదాన్నని తెలిపింది. చాలా రోజుల నుండి హైదరాబాద్‌లో ఉంటున్న ఇంతవరకు చార్మినార్ చూడలేదని.. ఏదో ఒక రోజు రాత్రి పూట బురఖా ధరించి అక్కడికి వెళ్తానని చెప్పుకొచ్చింది.  కాగా నితిన్‌తో తాజాగా నటించిన భీష్మ శివరాత్రి సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర తెగ సందడి చేస్తోంది. ఈ భామ అటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. సూర్యతో ఓ సినిమా, కార్తీతో మరో సినిమాలో నటిస్తోంది.
First published: February 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు