Home /News /movies /

RASHMIKA MANDANNA WANTS TO BE A DAUGHTER IN LAW FOR TAMILNADU HOME NR

Rashmika Mandanna: రష్మిక మందన్న పెళ్లి ఫిక్స్.. వరుడు ఆ ఇంటివాడే?

Rashmika Mandanna

Rashmika Mandanna

Rashmika Mandanna: టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. వరుస ఆఫర్ లతో తన ఖాతా నింపుకుంటుంది.

    Rashmika Mandanna: టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. వరుస ఆఫర్ లతో తన ఖాతా నింపుకుంటుంది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన నటించి.. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఇండియన్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే రష్మిక నోట నుండి మొత్తానికి పెళ్లి వార్త వినిపించింది.

    ఇటీవలే తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. సుల్తాన్ సినిమాతో తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయి గా నటించిన ఈ కన్నడ బ్యూటీ.. తన పాత్రతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అంతే కాకుండా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో తాజాగా కొన్ని విషయాలు పంచుకుంది రష్మిక మందన. తనకు తమిళ సంప్రదాయం, సంస్కృతి చాలా భిన్నంగా అనిపించిందని తెలిపింది.

    అవి తనను ఎంతగానో ఆకర్షించాయని, అక్కడ భోజనం, వంటలు చాలా రుచి గా ఉన్నాయని తెలిపింది ఈ బ్యూటీ. తమిళ వంటకాలంటే చాలా ఇష్టమని.. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలనే కోరిక ఉందని తెలిపింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాల్లో బిజీగా ఉంది. ఇక బాలీవుడ్ లో డెడ్లీ, మిషన్ మజ్ను వంటి వరుస సినిమాలలో నటించనుండగా.. హిందీలో మరో అవకాశాన్ని కూడా అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ తో ప్లాన్ చేస్తున్న సుకుమార్ సినిమాల్లో కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న రష్మిక మందన.. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Goodbye movie, Kirak party, Mission Majnu movie, Pushpa Movie, Rakshit Shetty, Rashmika, Rashmika Instagram, Rashmika mandanna, Rashmika mandanna marriage, Rashmika Twitter, Tamilnadu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు