విజయ్ దేవరకొండ ఇంటికి రష్మిక మందన..

విజయ్ దేవరకొండ ఇటీవల చాలా ఖర్చు పెట్టి ఓ ఇంటిని కొన్న సంగతి తెలిసిందే. 

news18-telugu
Updated: December 7, 2019, 1:48 PM IST
విజయ్ దేవరకొండ ఇంటికి రష్మిక మందన..
Instagram
  • Share this:
విజయ్ దేవరకొండ.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో అదిరిపోయే హిట్ అందుకుని ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత వెంటనే సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్. అర్జున్ రెడ్డి హిట్ తర్వాత వచ్చిన ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో అదిరిపోయే ఆదరణ పొందాడు. కాగా ఇటీవల వచ్చిన 'డియర్ కామ్రెడ్' సినిమా కొంత నిరాశ పరిచింది. అది అలా ఉంటే.. తాజాగా విజయ్ దేవరకొండ ఓ ఇంటివాడయ్యాడు. మొన్నటి వరకు శ్రీనగర్ కాలనీలో ఉంటున్న విజయ్ ఫ్యామిలీ.. ఇటీవలే ఫిల్మ్ నగర్‌లోని నటుడు శ్రీకాంత్ ఇంటికి సమీపంలో ఉన్న కొత్త ఇంటికి మారారు. ఈ కొత్త ఇంటిని విజయ్ దాదాపు రూ.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ.. తన తల్లితండ్రులు, సోదరులతో కలిసి కలిసి ఈ ఇంట్లో శాస్త్రోక్తంగా గృహ ప్రవేశం చేసాడు.  ఈ కొత్త ఇంటికి గీతా గోవిందం నటి రష్మిక మందన వచ్చారు. ఆమెతో పాటు దర్శకుడు వంశీ తన కుటుంబంతో హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఓ ఫోటో దిగారు. ఆ ఫోటోలో విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా ఉన్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విజయ్ ఇంటికి వచ్చిన రష్మిక, వంశీ ఫ్యామిలీ View this post on Instagram
 

Her happiness ❤ His pride ? Our new home! Sending you all lots of love from the 4 Deverakondas - you've all been a part of this journey with us ?


A post shared by Vijay Deverakonda (@thedeverakonda) on


కలర్‌ఫుల్ చీరలో మురిసిపోతున్న రష్మీ గౌతమ్..
First published: December 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>