రామ్ చరణ్‌తో రష్మిక రొమాన్స్.. భలే ఛాన్స్ కొట్టేసిన బన్నీ భామ..

చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: April 4, 2020, 2:59 PM IST
రామ్ చరణ్‌తో రష్మిక రొమాన్స్.. భలే ఛాన్స్ కొట్టేసిన బన్నీ భామ..
ఖాళీ టైమ్‌లో కుటుంబంతో పాటు ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. మంచి స్క్రిప్ట్స్ ఎంచుకునే పనిలో బిజీగా ఉన్నట్లు చెప్పింది. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేస్తానంటుంది రష్మిక మందన్న.
  • Share this:
చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మాట్నీ ఎంటర్టైన్ మెంట్‌తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మెసేజ్ ఓరియెంటెడ్‌గా వస్తోన్న ఈ చిత్రం.. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది. చిరంజీవి సరసన హీరోయిన్‌‌గా కాజల్ నటిస్తోంది. ఇటీవలే ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది. ఇక ఈ సినిమాలో చరణ్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఆయనకు జోడీగా అప్పట్లో సమంత చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత కైరా అద్వానీ అని అన్నారు. అయితే తాజాగా వస్తోన్న సమాచారం మేరకు రష్మిక మందన చరణ్ సరసన నటించనుందని తెలుస్తోంది. అనేక సంప్రదింపుల తర్వాత చిరవకు ఈ భామకు ఫిక్స్ అయ్యారని సమాచారం. కాగా రష్మిక ప్రస్తుతం బన్ని సరసన నటిస్తోంది. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆచార్యకు మణిశర్మ సంగీతాన్ని అందించనున్నాడు. మరో ముఖ్య పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారని సమాచారం.
Published by: Suresh Rachamalla
First published: April 4, 2020, 2:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading