మహేష్ బాబు అయిపోయాడు.. నెక్ట్స్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్..

Rashmika Mandanna: మహేష్ బాబు (Mahesh Babu) సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత వరస అవకాశాలు అందుకుంటుంది రష్మిక మందన్న. అల్లు అర్జున్ (Allu Arjun), ఎన్టీఆర్(Jr NTR) లాంటి హీరోలతో రొమాన్స్‌కు రెడీ అవుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 28, 2020, 4:11 PM IST
మహేష్ బాబు అయిపోయాడు.. నెక్ట్స్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్..
రష్మిక మందన్న (Rashmika Mandanna)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ టైమ్ నడుస్తుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాకపోతే ఒక్కరు కాదు ఇద్దరి టైమ్ బాగా నడుస్తుంది. పూజా హెగ్డేతో పాటు రష్మిక మందన్న టైమ్ కూడా నడుస్తుంది. ఇద్దరూ వరస ఆఫర్లతో రెచ్చిపోతున్నారు. ప్రతీ హీరో, దర్శకుడు ఈ ఇద్దరే కావాలంటున్నారు. ఇప్పుడు కూడా పూజా తర్వాత రష్మికే దూసుకుపోతుంది. ఇద్దరు నెంబర్ వన్ ప్లేస్ కోసం చూస్తున్నారు. ఇప్పటికే తెలుగులో రష్మిక మందన్న వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో తొలిసారి పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా చేసింది రష్మిక. ఈ చిత్రంలో డాన్సులతో పాటు కామెడీ కూడా బాగానే చేసింది.

రష్మిక మందన్న (Rashmika Mandanna), అల్లు అర్జున్ (Allu Arjun)
రష్మిక మందన్న (Rashmika Mandanna)


అప్పట్లో దూకుడు సినిమా ఎలాగైతే సమంతకు బ్రేక్ ఇచ్చిందో.. ఇప్పుడు రష్మికకు కూడా సరిలేరు నీకెవ్వరు అలాగే బ్రేక్ ఇచ్చేలా కనిపిస్తుంది. ఈ చిత్రం తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాలు ఈమె ముందు క్యూ కడుతున్నాయి. ఇదే జోరు చూపిస్తే కచ్చితంగా త్వరలోనే ఈమె నెంబర్ వన్ కావడం ఖాయం. ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న భీష్మ సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా ఖరారైంది రష్మిక. అందులో అల్లు అర్జున్, సుకుమార్ సినిమా కూడా ఉంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైపోయింది. ఇందులో రంగస్థలంలో సమంత తరహా పాత్రలో కనిపించబోతుంది రష్మిక.

రష్మిక మందన్న (Rashmika Mandanna),జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)
రష్మిక మందన్న (Rashmika Mandanna),జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)
ఇదిలా ఉండగానే ఇప్పుడు మరో ఆఫర్ కూడా రష్మిక ముందుకు వచ్చేసింది. అదే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అవకాశం. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు నందమూరి చిన్నోడు. ఈ చిత్రంలో రష్మికనే హీరోయిన్‌గా తీసుకోవాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాల్లో నటించిందంటే మాత్రం రామ్ చరణ్, ప్రభాస్ లాంటి వాళ్లు కూడా పిలిచి మరీ అవకాశాలు ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. చూస్తుంటే రాబోయే ఏడాది కాలంలోనే రష్మిక నెంబర్ వన్ అయిపోయేలా కనిపిస్తుంది. మరి చూడాలిక.. ఈమె అదృష్టం ఎలా ఉండబోతుందో..?
First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు